Homeఆంధ్రప్రదేశ్‌Student Puts Money In Answer Sheet To Pass Exam: నన్ను పాస్ చేయండి...

Student Puts Money In Answer Sheet To Pass Exam: నన్ను పాస్ చేయండి అంటూ ఆన్సర్ షీట్లో డబ్బులు పెట్టిన విద్యార్థి

Student Puts Money In Answer Sheet To Pass Exam: ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చాయి. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు మార్కుల విషయంలో నిరాశతో ఉన్నారు. ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థులు మాత్రం బాధతో ఉన్నారు. కొంతమంది బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు. అయితే విశాఖకు చెందిన ఓ విద్యార్థి మాత్రం కొత్తగా ఆలోచన చేశాడు. ఏకంగా ఇంటర్ బోర్డు అధికారులకు ఫోన్ చేశాడు. తనను ఎలాగైనా సరే పాస్ చేయాలంటూ మొరపెట్టుకున్నాడు. తాను పరీక్షల సమయంలో ఏం చదవలేదని… ఆన్సర్ షీట్లో ప్రశ్న పత్రాన్ని మూడుసార్లు రాశానని.. తనను పాస్ చేయమని ఆన్సర్ షీట్లో డబ్బులు కూడా పెట్టినట్లు అధికారులకు చెప్పాడు. వెంటనే అధికారులు ఆ విద్యార్థికి ఫోన్లోనే కౌన్సిలింగ్ చేశారు. త్వరలో అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు ఉన్నాయని.. బాగా చదువుకుని పరీక్షలు రాయమని సూచించారు. వెంటనే ఇంటర్ బోర్డు అధికారులు విశాఖపట్నం ఆరై కు ఫోన్ చేసి విషయం వివరించారు. దీంతో తల్లిదండ్రులకు జిల్లా అధికారులు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

* ఏకంగా ఐదు సబ్జెక్టుల్లో ఫెయిల్..
సదరు విద్యార్థి ఈ ఏడాది ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాశాడు. గత ఏడాది సైతం రెండు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాడు. సెకండ్ ఇయర్ లో మూడు సబ్జెక్టుల్లో తప్పాడు. ఫలితాల రాకముందే ఇంటర్ బోర్డు నంబర్ తెలుసుకొని ఫోన్ చేసి తనను పాస్ చేయమని కోరాడు. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్, పదో తరగతి పరీక్ష ఫలితాలు వచ్చాయి. ఉత్తీర్ణత సాధించిన చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే ఈ విద్యార్థి ఏకంగా ఇంటర్ బోర్డు అధికారులకు ఫోన్ చేస్తే వారు కౌన్సిలింగ్ ఇచ్చారు తప్ప.. ఎటువంటి హెచ్చరికలు జాయిన్ చేయలేదు. మరోసారి ఇంటర్ పరీక్షలు రాసే అవకాశం ఉన్న దృష్ట్యా బాగా చదువుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

* ఇటువంటివి సర్వసాధారణం..
అయితే ఇటువంటి ఘటనలు పరీక్షల ఫలితాలు ప్రకటించినప్పుడు సర్వసాధారణంగా మారాయి. కానీ కొంతమంది విద్యార్థులు చదువుపై అంత ఆసక్తి ఉండదు.. కానీ తల్లిదండ్రుల ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. ఆ సమయంలోనే ఎక్కువమంది భావోద్వేగానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ ఏడాది ఇంటర్ ఫలితాలు వచ్చాయి. ఉత్తీర్ణత శాతం బాగుంది. కానీ అక్కడక్కడ ఆత్మహత్య ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ముఖ్యం. కానీ అంతకంటే వారి ఆసక్తి గమనించాలి. తప్పుడు ఆలోచనలు రాకుండా చూసుకోవాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular