TTD Laddu: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. వైసిపి హయాంలో తిరుపతి లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు ఈ సంచలన విషయాన్ని బయటపెట్టారు. నెయ్యిలో జంతు కొవ్వు కలిపారని ఆరోపణ చేశారు. అది మొదలు భక్తులు ఆందోళనకు గురయ్యారు. ఈ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందంపై వైసిపి అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అలా ఏర్పాటైన సిట్ గత 14 నెలలుగా విచారణ చేపట్టి నెయ్యి కల్తీ జరిగిందని ఆధారాలు సేకరించి చార్ట్ సీట్ దాఖలు చేసింది.
* సీఎం చంద్రబాబు ఆరోపణలు గుర్తుచేస్తూ..
అయితే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రచారానికి తెరతీసింది. సీఎం చంద్రబాబు( CM Chandrababu ) జంతు కొవ్వు కలిపారని ఆరోపించారని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదే వ్యాఖ్యలు చేశారని గుర్తుచేస్తోంది. ఇప్పుడు పామ్ ఆయిల్ కలిపారని.. రసాయనాలు మాత్రమే కలిపారని సిట్ విచారణలో తేలిన విషయాన్ని ప్రస్తావిస్తోంది. జంతు కొవ్వు కలిపారని చెప్పిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది. అయితే సిట్ చార్జ్ షీట్ లో పామాయిల్ కలిపారని.. కల్తీ జరిపారన్న విషయాన్ని మాత్రం వైసిపి మర్చిపోతుంది. అయితే ఈ కేసులో తమపై ఎక్కడ అభియోగాలు వచ్చాయని భావించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భయపడుతోంది. ఈ కేసు రాజకీయంగా తమపై ప్రభావం చూపుతుందని కూడా అనుమానిస్తోంది. అందుకే ఈ కొత్త ప్రచారానికి తెర తీసినట్లు తెలుస్తోంది.
* నెయ్యిలో పామాయిల్..
భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ.. నెయ్యి కల్తీ చేయడానికి సమర్ధించుకుంటుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇదే సిట్( special investigation team) పామాయిల్ కలిపారని.. వ్యవస్థీకృత దోపిడీ జరిగిందని.. టీటీడీకి సరఫరా జరిగిన 60 లక్షల కేజీల నెయ్యికి.. కిలో వద్ద 25 రూపాయల లంచం తీసుకున్న విషయం స్పష్టంగా చెప్పగా.. దాని గురించి వైసిపి పట్టించుకోవడం లేదు. కేవలం జంతువు కలిపారు అన్న ఆరోపణ రుజువు కాలేదు అని ప్రశ్నిస్తోంది. ఇది నిజంగా సిగ్గుచేటు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందల కోట్ల రూపాయలు దుర్వినియోగమయ్యాయని సిట్ ధ్రువీకరిస్తే.. ఎంత మాత్రం జంతు కొవ్వు కలపలేదన్న మాట మాత్రమే చెబుతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. నెయ్యిలో కల్తీ జరిగిందన్న విషయాన్ని మాత్రం ఒప్పుకోకపోతోంది. ఇది నిజంగా దురదృష్టకరం.