Samsung Galaxy S24 Plus: ఫ్లిప్ కార్టు సాసా సేల్ 2025(Flipkart SASA LELE Sale 2025)లో స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో మీకోసం ఒక అదిరిపోయే డీల్‌ను ఈ కథనంలో తెలసుకుందాం. ఫ్లిప్ కార్టులో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24ప్లస్( Samsung Galaxy S24 Plus) ఏకంగా రూ.47,000 తగ్గింపుతో అమ్ముడవుతోంది. ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో వచ్చే ఈ పవర్‌ఫుల్ ఫోన్‌ను భారీ డిస్కౌంట్‌తో కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆఫర్ వివరాలను తెలుసుకుందాం.
Also Read: యాపిల్‌పై సుంకాల భారం.. భారత్‌లో ఉత్పత్తి విస్తరణకు సన్నాహం!
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24ప్లస్ ధర
ఫ్లిప్ కార్టులో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24ప్లస్ 12GB RAM/256GB స్టోరేజ్ వేరియంట్ రూ.52,999కి అమ్ముడవుతోంది. కంపెనీ ఈ ఫోన్‌ను మొదట రూ.99,999కి విడుదల చేసింది. అంటే, లాంచ్ ధర కంటే ఇప్పుడు ఈ ఫోన్ ఏకంగా రూ.47,000 తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో 50MP ట్రిపుల్ రియర్ కెమెరా, 12MP ఫ్రంట్ కెమెరా, ఎక్సినోస్ 2400 ప్రాసెసర్, 6.7-ఇంచ్ క్వాడ్ HD+ డిస్‌ప్లే, 4900mAh బ్యాటరీ ఉన్నాయి.
ఫ్లిప్ కార్ట్ ఆఫర్స్
ఈ ఫోన్‌తో పాటు అద్భుతమైన ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. Flipkart Axis Bank క్రెడిట్ కార్డ్‌తో బిల్ పేమెంట్ చేస్తే అదనంగా 5 శాతం ఆదా చేసుకోవచ్చు. అంతేకాదు, మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.52,150 వరకు తగ్గింపు పొందవచ్చు. వినియోగదారుల సౌలభ్యం కోసం కంపెనీ నో-కాస్ట్ EMI సౌకర్యాన్ని కూడా అందిస్తోంది.
సేల్‌లో మరిన్ని బెస్ట్ డీల్స్
ఐఫోన్ 16 ప్లస్ ధర: ఫ్లిప్ కార్టులో ఈ ఫోన్ రికార్డ్ బ్రేకింగ్ ధర తగ్గింపుతో అందుబాటులో ఉందని పేర్కొన్నారు. డిస్కౌంట్ తర్వాత ఇది రూ.79,999కి అమ్ముడవుతోంది. ఈ ధరకు మీకు 128GB స్టోరేజ్ వేరియంట్ లభిస్తుంది. iPhone 16 Plusతో నో-కాస్ట్ EMI సౌకర్యం లేనప్పటికీ ఈ ఫోన్‌ను EMI ఆప్షన్‌తో కొనుగోలు చేయవచ్చు.