Sambasiva Rao: తెలుగు మీడియా రంగంలో చెప్పుకోదగ్గ జర్నలిస్టుల్లో కొంత మంది ఉంటారు. ఇందులో ముందు వరసలో టీవీ 5 లో పని చేసే జర్నలిస్ట్ సాంబ శివ రావు ఉంటాడు. ఈయన చేసే విశ్లేషణలు, వ్యాఖ్యానాలు విచిత్రంగా ఉంటాయి. మిగతా పాత్రికేయులకు.. ఈయనకు అదే తేడా. అయినప్పటికీ సాంబశివరావు తన ధోరణి మార్చుకోరు. పైగా ఎవరు ఏమనుకున్నా సరే డోంట్ కేర్ అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు.. కూటమి ప్రభుత్వానికి టివి5 అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటుంది. సాంబశివరావు చేసే వ్యాఖ్యానాలు కూడా అలానే ఉంటాయి.. పైగా అవి జనాలలోకి అత్యంత సులువుగా వెళుతుంటాయి. సాంబశివరావు చేసే వ్యాఖ్యానాలను, విశ్లేషణలను వైసీపీ శ్రేణులు పదే పదే ట్రోల్ చేస్తుంటాయి.. అయినప్పటికీ సాంబశివరావు ఏ మాత్రం తగ్గరు. పైగా తన దూకుడు ఇంకా ఎక్కువ స్థాయిలో కొనసాగిస్తుంటారు.
సాంబశివరావు సీనియర్ జర్నలిస్ట్. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. చెడుగుడు ఆడుకునేవారు. తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేవారు. ప్రముఖంగా జగన్ ప్రభుత్వం హయాంలో చోటు చేసుకున్న అక్రమాలపై విపరీతంగా వార్త విశ్లేషణ చేసేవారు సాంబశివరావు.. సాంబశివరావు వ్యాఖ్యానాలు, విశ్లేషణలు మిగతా జర్నలిస్టులతో పోల్చితే కాస్త విచిత్రంగా ఉంటాయి కాబట్టి.. ఆయనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఆయన మాట్లాడే మాటలు.. చేసే విశ్లేషణలు మాత్రమే కాదు, చేసే హెచ్చరికలు కూడా ఇప్పుడు ట్రోల్ అవుతున్నాయి. వైసీపీ అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్ సాంబశివరావు వీడియోలను తెగ సర్కులేట్ చేస్తున్నాయి.
ఇటీవల టీమ్ ఇండియా వన్డే వరల్డ్ కప్ సాధించింది. దీనిని భారత జట్టు సాధించిన విజయం మాదిరిగా కాకుండా..ఈ విజయానికి నారా లోకేష్, ఇతరులు కారణమని సాంబశివరావు పేర్కొన్నారు. ఇక ఈ వీడియోను వైసీపీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకోవడం మొదలు పెట్టారు. ఇది సాంబశివరావు దృష్టికి వెళ్ళింది. అంతే ఆయన మాస్ వార్నింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే దానిని కూడా వైసీపీ శ్రేణులు ట్రోల్ చేయడం మొదలుపెట్టాయి. వాస్తవానికి వైసిపి నాయకులకు టివి5 సాంబశివరావు దొరికిపోవడం ఇదే తొలిసారి కాదు. వారు ట్రోల్ చేస్తూనే ఉంటారు..ఈయన విమర్శలు చేస్తూనే ఉంటారు. ఇందులో ఎవరూ తగ్గరు. జనాలను మాత్రం ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు.
నన్నే ట్రోలింగ్ చేస్తారా??
అసలు… సోషియల్ మీడియా చూడటం మానేయండి!!- ప్రజలకు సాంబశివరావు పిలుపు!!! pic.twitter.com/LYe61aLkLV— The Samosa Times (@Samotimes2026) November 11, 2025