Site icon OkTelugu

Samba Siva Rao TV5: సాంబ సార్.. మీ పచ్చ జర్నలిజం వర్ధిల్లాలి..

Samba Siva Rao TV5

Samba Siva Rao TV5

Samba Siva Rao TV5: మీడియా అనేది బాకాలు ఊదే వ్యవస్థగా మారిపోయి చాలా సంవత్సరాలు గడిచిపోయింది. తెలుగు రాష్ట్రాలలో ఇది ఇంకా చాలా దారుణంగా ఉంది. రాజకీయ పార్టీలకు మౌత్ పీసుల మాదిరిగా మీడియా దిగజారిపోయింది. ఒక వార్త ప్రసారం అవుతోంది అంటే మీది ఏ పార్టీకి అనుకూలమైన భజన ఛానల్ అనే పరిస్థితి ప్రజల్లో వచ్చేసింది. మీడియా యాజమాన్యాల రాజకీయరంగుల వల్ల ప్రజలకు వాస్తవం అనేది తెలవకుండా పోతుంది. ఎవరికివారు భజన చేయడంలో పోటీపడుతున్నారు. యాజమాన్యాలు అలా ఉన్నాయంటే.. యాజమాన్యాల కింద పనిచేసే వారు మరింత ఘోరంగా తయారయ్యారు.

ఆయా చానల్స్ లో పనిచేస్తున్న జర్నలిస్టులు పార్టీలకు డప్పు కొట్టడంలో.. భజన చేయడంలో ఒక స్థాయిని కూడా దాటిపోయారు. తాము చదువుతున్నది వార్తలనని.. లక్షల మంది జనం చూస్తున్నారని సోయి కూడా లేకుండా వ్యవహరిస్తున్నారు. చివరికి ఈ భజన కార్యక్రమం ఎక్కడ దాకా దిగజారింది అంటే.. సగటు కార్యకర్త కూడా బాధపడేలాగా.. ఎన్నడు ఈ స్థాయిలో తమ నాయకుడిని ఈ స్థాయిలో భుజాల మీద మోయలేని విధంగా మారిపోయింది.

ఓ చానల్లో పనిచేసే జర్నలిస్టు ఓ పార్టీకి భజన చేస్తుంటారు. ఆ ఛానల్ యాజమాన్యం కూడా ఆ పార్టీకి మౌత్ పీస్ లాగా ఉంటుంది. ఆ చానల్ యజమాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత కీలకమైన దేవస్థానానికి చైర్మన్. అంతకుముందే ఆ ఛానల్ ఆ పార్టీకి వీర లెవెల్లో భజన చేసేది. ఇప్పుడు ఆయన దేవస్థానానికి చైర్మన్ కావడంతో ఆ భజన మరింత పెరిగిపోయింది. ముఖ్యంగా ప్రైమ్ టైం లో టెలికాస్ట్ అయ్యే ప్రోగ్రామ్ లలో అయితే ఆ జర్నలిస్ట్ పసుపు దండకం చదువుతూ ఉంటాడు. ఒంటికి పసుపు రంగు పూసుకొని పోతురాజు మాదిరిగా కొట్టుకుంటూ ఉంటాడు.

అతడు ఇచ్చే ఎలివేషన్లు కేజిఎఫ్ సినిమాను కూడా దాటిపోయి ఉంటాయి. అసలు ఇటువంటి వ్యక్తులను జర్నలిస్టులు అనాలా.. దీనిని జర్నలిజం అని చెప్పుకోవాలా.. ఇంతకంటే దిగజారుడుతనం ఇంకొకటి ఏముంటుంది. న్యూట్రల్ గా వ్యవహరించాల్సిన మీడియా ఇలా డప్పు కొట్టే వ్యవస్థ లాగా మారిపోవడం.. జర్నలిస్టులు ఇలా పార్టీ కార్యకర్తలుగా మారిపోతున్న దుర్మార్గం.. ఇంతకంటే హీనం ఇంకొకటి ఏముంటుంది.. ఇంతకంటే డౌన్ ఫాల్ ఇంకొకటి ఉంటుందా.. దీనిని పాత్రికేయం అని ఎలా అంటారని.. విశ్లేషకులు చెబుతున్నారు. సమాజంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో.. అన్ని పార్టీలకు అనుకూలంగా మీడియా చానల్స్ ఉన్నాయి. అలాంటప్పుడు మీడియా నుంచి నిష్పక్షపాతం వ్యవహరించడం.. ఎడారిలో నీటి కోసం వెతకడం లాంటిదేనని విశ్లేషకుల మాట.

Exit mobile version