RTC Travel Misuse: మహిళలకు ఆర్టీసీలో( APSRTC ) ఉచిత ప్రయాణాన్ని కల్పించింది ఏపీ ప్రభుత్వం. ఇందుకు గాను కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతోంది. ఆర్థికంగా నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల వారికి భరోసా ఇవ్వాలని ఉద్దేశంతో ఈ పథకం అమలు చేస్తోంది. ప్రతి కుటుంబానికి నెలకు 4వేల రూపాయల వరకు రవాణా భారం తగ్గించేందుకుగాను స్త్రీ శక్తి పథకానికి శ్రీకారం చుట్టింది. ఆగస్టు 15న ఈ పథకం ప్రారంభించింది. ప్రతిరోజు లక్షలాదిమంది మహిళా ప్రయాణికులు ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వం సదుద్దేశంతో ప్రారంభించిన ఈ పథకాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు బస్సుల్లో రద్దీ నెలకొనడంతో మహిళా ప్రయాణికుల మధ్య వాగ్వాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అనంతపురం జిల్లాకు చెందిన ఓ మహిళ సోషల్ మీడియాలో పెట్టిన వీడియో విమర్శలకు కారణము అవుతోంది.
Also Read: ఫ్రీ బస్సు ఎఫెక్ట్ : ఏపీ బస్సుల్లో మహిళల కొట్లాట మొదలైంది.. వీడియో
ఏకంగా రీల్స్..
అనంతపురం జిల్లాకు( Ananthapuram district) చెందిన ఓ మహిళకు రీల్స్ చేసే అలవాటు ఉంది. ఈ తరుణంలో ఆమె ఉచిత ప్రయాణ పథకాన్ని సద్వినియోగం చేసుకుంది. ఆర్టీసీ బస్సు పై ఉచితంగా ప్రయాణం చేసి గమ్యస్థానానికి చేరుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆమె విడుదల చేసిన వీడియో వైరల్ అవుతుంది. అమ్మకు ఇష్టమైన కట్లపొడి.. ఆకు కట్టల కోసం అనంతపురం ఆర్టీసీ పై ఉచితంగా వచ్చానని.. చాలా ఆనందంగా ఉంది అంటూ చేసిన రీల్స్ వీడియోను ఆమె సోషల్ మీడియాలో పెట్టారు. అది వైరల్ కావడంతో నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎంతో మంచి ఉద్దేశంతో ఉచిత ప్రయాణ పథకం పెడితే ఇలా దుర్వినియోగం చేయడం ఏంటి అని ఎక్కువ మంది నిలదీస్తున్నారు. ఇటువంటివి చాలా తప్పు అని.. ఇది పథకాన్ని పక్కదారి పట్టించడం అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: స్త్రీ శక్తి పథకం.. గొప్పలకు పోతే భవిష్యత్తులో తిప్పలేనా?
సోషల్ మీడియాలో వైరల్..
అయితే మహిళల ఉచిత ప్రయాణ పథకానికి సంబంధించి సోషల్ మీడియాలో( social media) అనేక రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. అప్పుడే బస్సుల్లో కీచులాటలు ప్రారంభం అయ్యాయని.. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని బస్సులు నడపాలన్న డిమాండ్ పెరుగుతోంది. అన్ని రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తే ఈ ఇబ్బంది ఉండదు అన్న వారు కూడా ఉన్నారు. అయితే ఈ పథకం విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంది. తెలంగాణలో ఇప్పటికే ఈ పథకం అమలవుతోంది. అక్కడ కూడా ఇటువంటి వివాదాలు జరిగాయి. ఆ పాత వీడియోలను తెరపైకి తెచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు. ఏపీలో ఇలా జరుగుతోందని చెప్పుకొస్తున్నారు. అయితే రాజకీయపరంగా విమర్శలు చేయవచ్చు కానీ.. కొందరు మహిళలు మాత్రం ఏ పని లేకుండా ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్నారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే సోషల్ మీడియాలో సైతం ప్రచారం సాగుతోంది.
ఏపీలో ఫ్రీ బస్.. మహిళ ఏం చేసిందో చూడండి (VIDEO)@YSRCParty
AP: ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణాన్ని కొందరు సరదా కోసం వినియోగిస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఓ మహిళ ఫన్ కోసం రీల్ చేసి పోస్ట్ చేశారు. ‘అమ్మకు ఇచ్చిన కట్టుపాడి, ఆకులు తీసుకెళ్లడానికి ఫ్రీగా తాడిపత్రి నుంచి… pic.twitter.com/S51beZzcxo
— YSRCP Rajasekhara reddy ambakapalli (@raja_ambakapaly) August 20, 2025