RK Kotha Paluku: కొన్ని విషయాలను బయటకు చెప్పకూడదు. కొన్ని నిజాలను బహిర్గతం చేయకూడదు. కానీ ఆర్కే అలా కాదు. ఈ విషయమైనా సరే కడుపులో దాచుకోడు. ముఖ్యంగా చంద్రబాబు ప్రస్తావన వస్తే ఏమాత్రం ఆగడు. ఆగ్రహాన్ని ఏ స్థాయిలో అయితే వ్యక్తం చేస్తాడో.. ఆనందాన్ని కూడా అదే స్థాయిలో ప్రదర్శిస్తాడు. అందుకే ఆర్కే రాసే రాతలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందులో నిజాలు ఉండొచ్చు.. అబద్ధాలు కూడా ఉండవచ్చు. అయితే ఈ రెండింటిని దాచుకోవడంలో ఆర్కే ఏ మాత్రం తటపటాయించడు.
Also Read: అలాస్కా లో రహస్య పత్రాలు.. ట్రంప్, పుతిన్ భేటీ లో ఇన్ని భద్రతా లోపాలా?
ఆదివారం రాసిన కొత్త పలుకులో రాధాకృష్ణ జగన్ కు ఎప్పటి మాదిరిగానే తలంటాడు. పిల్లిశాపనార్ధాలు.. బేలతనం.. రకరకాల పద ప్రయోగాలు చేశాడు. ఖర్మ ఫలితం అనుభవించు అన్నట్టుగా రాధాకృష్ణ జగన్ ను శపించాడు. అయితే ఇదే టెంపొ లో ” దొంగ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం వల్లే వైసీపీకి డిపాజిట్ కూడా గల్లంతయిందా.. లేక ప్రజల్లో నిజంగానే జగన్ పట్ల విముఖత ఏర్పడుతోందా” అనేది పరిశీలించాలని రాధాకృష్ణ రాసుకొచ్చాడు.. అంటే పులివెందులలో టిడిపి అభ్యర్థి దొంగ ఓట్లతో గెలిచాడని భావించాలా.. వైసీపీ ఆరోపణలతో ఏకీభవించాలా.. అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పనమవుతున్నాయి..
” జగన్ హయాంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో అప్పటి ప్రభుత్వం అన్ని హద్దులు దాటిపోయింది. అత్యధి పార్టీకి చెందిన వారిని నామినేషన్లు కూడా వేయనీయలేదు. ఇప్పుడు పులివెందులలో వారి పార్టీ ఏజెంట్లు కూడా ఉండనివ్వడంలేదని జగన్ విమర్శిస్తున్నారు. ఇప్పుడు కనీసం నామినేషన్ అయినా వేసుకొని ఇచ్చారని సంతృప్తి పడడం మంచిదేమో. తిరుపతి పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో.. విచ్చలవిడిగా దొంగ బూట్లు వేయించుకున్నారు. అప్పుడు అదంతా న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా జరిగిందని చెప్పుకున్నారు కదా.. అప్పుడు మీరు ఏర్పరిచిన దారిలోనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం నడిచి ఉంటుంది. అందువల్లే జగన్ ఆయన అనుచరుడు చేస్తున్న గోలను ఎవరూ పట్టించుకోవడం లేదు.. అప్పట్లో స్థానిక ఎన్నికల్లో 90 శాతానికి పైగా సీట్లు సాధించి మీరు సంబరపడ్డారు కదా. ప్రజల్లో సానుకూలత ఉందని జబ్బలు చరుచుకున్నారు కదా. ఇప్పుడు కూటమి నేతలు కూడా అదే పని చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో విజయం సాధించినప్పటికీ.. సాధారణ ఎన్నికల్లో ఆ ఫలితం ఉండదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో భారత రాష్ట్ర సమితి నూటికి నూరు శాతం విజయం సాధించింది. ఆయన 2023లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయింది. ఆంధ్రప్రదేశ్లో జగన్ పరిస్థితి కూడా ఇదే. అప్పుడు కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఏం చేశారో మర్చిపోతే ఎలా అంటూ” రాధాకృష్ణ రాసుకోచ్చారు.
రాధాకృష్ణ చెప్పినట్టుగానే తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ అడ్డదారులు తొక్కింది అనుకున్నాం. ఇష్టానుసారంగా పనిచేసింది అనుకుందాం. అందువల్లే కదా 2024 ఎన్నికల్లో వైసీపీకి దారుణమైన ఓటమి ఎదురైంది. ఇప్పుడు వైసిపి దారిలోనే కూటమి వెళ్తుంటే దానిని రాధాకృష్ణ ఎలా సమర్థిస్తారు.. ఒకడు తప్పు చేస్తే మనం దానిని సరిదిద్దాలి. అప్పుడే కదా ప్రజల్లో మన మీద నమ్మకం ఏర్పడేది. అలాకాకుండా ఒకటి తప్పు చేస్తే మనం కూడా అదేదారిలో వెళ్తామంటే.. అప్పుడు వాడికి మనకు తేడా ఏంటి.. కూటమినేతలకు రాధాకృష్ణ ఇలా తలంటాలి కదా.. అలా కాకుండా జగన్ ను తిట్టడంలో అంతరార్థం ఏమిటి.. స్థానిక ఎన్నికల్లో గెలిస్తే సాధారణ ఎన్నికల్లో ఓడిపోతారని రాధాకృష్ణ చెప్పినప్పుడు.. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పి స్థానాలలో గెలిచిన టిడిపి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాలేదని రాధాకృష్ణ చెబుతున్నారా.. అందువల్లే ఇలాంటి రాతలు రాస్తున్నారా.. ఏమో చూస్తుంటే అలానే కనిపిస్తోంది.