Raghurama Krishnam Raju: రఘురామకృష్ణం రాజు కొత్త పార్టీ పెడతారా? అందులో వాస్తవం ఉందా? ఇలా జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంత? పొలిటికల్ సర్కిల్స్ లో దీనిపైన చర్చ నడుస్తోంది. టిడిపి తో పాటు కూటమిలో లేనిపోని వివాదాలకు రఘురామకృష్ణంరాజు కారణమవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అయితే తనకు అటువంటి ఉద్దేశం లేదని.. చంద్రబాబుతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు రఘురామకృష్ణంరాజు. మరోవైపు మంత్రి పదవి కోసమే ఇలా ప్రవర్తిస్తున్నారు అనేది ఒక కామెంట్ ఉంది. అయితే రఘురామకృష్ణం రాజుకు మంత్రి పదవి ఇవ్వడం కంటే ఆయన సొంత పార్టీ పెట్టుకోవడమే టిడిపికి మేలని ఆ పార్టీ క్యాడర్ భావిస్తోంది. వైసీపీలో ఉంటూ ఆ పార్టీపై తిరుగుబాటు చేసిన రఘురామ వల్ల టిడిపికి ప్లస్సు అయ్యింది. అదే సమయంలో చంద్రబాబు పిలిచి మరీ చివరి నిమిషంలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఇచ్చారు. కానీ రఘురామకృష్ణం రాజు లేనిపోని వివాదాలతో ఇరకాటంలో పెడుతున్నారు.
* తెలుగు వీర లేవరా అంటూ..
రఘురామకృష్ణం రాజు తెలుగు వీర లేవరా అనే కొత్త పార్టీ పెట్టబోతున్నారు అనేది పొలిటికల్ వర్గాల్లో ఒక చర్చ. ఇటీవల జరిగిన పరిణామాలతో ఆయన ఈ సొంత పార్టీ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. ఇలా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు ఆయన. మరోవైపు తెలుగు వీర లేవరా అనేది సామాజిక వర్గంలో కష్టంలో ఉన్న వారికి ఆదుకునేందుకు రూపొందించిన ఒక ఫోరం అని.. అంతకుమించి ఏమీ లేదన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఇటీవల ఆకివీడు రామాలయ నిర్మాణానికి సంబంధించి.. రఘురామకృష్ణం రాజు చర్యల వల్ల టిడిపికి ఇబ్బందికర పరిస్థితిలు ఎదురయ్యాయి. రఘురామకృష్ణం రాజు చర్యలతో దళితులు టిడిపికి దూరమయ్యే ఛాన్స్ ఉందన్న టాక్ కూడా ఉంది. ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మందకృష్ణ మాదిగ, మహాసేన రాజేష్. అయితే అనవసరంగా లేనిపోని వివాదాలతో ఇబ్బందులు తెస్తున్నారన్న ఆగ్రహం రఘురామకృష్ణం రాజు పై టిడిపి నాయకత్వానికి ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.
* వైసీపీలో రెబెల్ గా మారి
2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు రఘురామకృష్ణంరాజు. గెలిచిన ఆరు నెలలకే ఆ పార్టీకి రెబెల్ గా మారిపోయారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఎదురైతే టిడిపికి కష్టం అన్న వారు ఉన్నారు. అందుకే రఘురామకృష్ణం రాజు కొత్త పార్టీ పెడదామంటే అడ్డుకునే ప్రయత్నం చేయకూడదని.. ఆయనను అలా వదిలేస్తే టిడిపికి లాభం అన్న వారు కూడా ఉన్నారు. కానీ తాను కొత్త పార్టీ అంటూ ఎటువంటిది లేదని.. అటువంటిది ఆలోచన ఏమి చేయలేదని చెబుతున్నారు రఘురామకృష్ణంరాజు. చూడాలి ఏం జరుగుతుందో..
