Raghuram Krishnam Raju: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజుకు( AP deputy speaker Raghuram Krishnam Raju ) ఇబ్బందికర పరిస్థితి ఎదురయింది. ఆయనపై రాష్ట్రపతి కార్యాలయానికి ఫిర్యాదు అందింది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ రాజకీయాలు మాట్లాడుతున్నారని.. పొలిటికల్ కామెంట్స్ చేస్తున్నారని జై భీమ్ రావు భారత్ పార్టీ ప్రతినిధి సురేష్ కుమార్ ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్రపతి భవన్ ప్రాథమిక విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తూ లేఖ రాసింది. రఘురామకృష్ణం రాజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో కాస్త దూకుడుగానే ఉంటారు. ఆయన దూకుడుకు కళ్లెం వేయాలని రాష్ట్రపతికి నేరుగా ఫిర్యాదు చేసినట్టు అనిపిస్తోంది.
* రెండోసారి ఫిర్యాదుతో..
అయితే రెండోసారి ఫిర్యాదు చేయడంతోనే రాష్ట్రపతి భవన్ స్పందించింది. స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ వంటి రాజ్యాంగబద్ధ పదవి చేపట్టిన తర్వాత వారు రాజకీయాలకు అతీతంగా ఉండాలి. ఏ పార్టీకి కొమ్ము కాయకూడదు. ఇది అంశాన్ని పట్టుకొని ఫిర్యాదు చేయడం విశేషం. రఘురామకృష్ణంరాజు తన సొంత నియోజకవర్గంలో పాటు మీడియా సమావేశం రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేస్తుంటారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఫిర్యాదుదారుడు ఎత్తిచూపారు. ఇటీవల రఘురామకృష్ణంరాజు మతమార్పిడులు, ఎస్సీ రిజర్వేషన్లు, ఇతర రాజకీయ అంశాలపై ఎక్కువగా మాట్లాడుతున్నారు. అందుకే రాష్ట్రపతి భవన్ వేగంగా స్పందించింది.
* గతంలో తమ్మినేని..
అయితే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారు చాలామంది రాజకీయాలతో పాటు వ్యక్తిగత విమర్శలకు దిగుతుంటారు. గత ప్రభుత్వ హయాంలో స్పీకర్ గా వ్యవహరించిన తమ్మినేని సీతారాం( Tammineni Sitaram ) ఘోరంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈ లెక్కన అయితే ఆయనపై ఎన్నడో చర్యలు తీసుకోవాలి. ఆయన సభలోనే కాదు సభ బయట కూడా మాట్లాడారు. ముందుగా తాను ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేనని.. తరువాత స్పీకర్ అయ్యానని లాజిక్ పాయింట్ చెప్పుకొచ్చేవారు. రాజకీయాలు మాట్లాడడం ఒక శాసన సభ్యుడిగా తన హక్కు అని వాదించేవారు. అయితే రఘురామకృష్ణం రాజు రాజకీయాల కంటే సమకాలీన అంశాలపైనే ఎక్కువగా మాట్లాడుతున్నారు. అందుకే ఇప్పుడు ఆయనను అడ్డుకోవాలని విచిత్రమైన ఫిర్యాదులు చేస్తున్నారు.
