Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan: పవర్ ఫుల్ స్క్రిప్ట్.. కానీ జగన్ పూర్

CM Jagan: పవర్ ఫుల్ స్క్రిప్ట్.. కానీ జగన్ పూర్

CM Jagan: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ హీ ట్ నెలకొంది. అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్ సిద్ధం సభలు నిర్వహిస్తున్నారు. ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. అయితే జగన్ ప్రసంగశైలి మారింది. సూటిగా, సుత్తి లేకుండా సాగుతుండడంతో జనం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పటివరకు మూడు సభలు జరిగాయి. భీమిలిలో మొదటి సభ జరిగింది. రెండో సభ దెందులూరు లో జరగగా.. మూడో సభ రాప్తాడులో నిర్వహించారు. ఈ మూడు సభల్లో వేర్వేరు రీతుల్లో జగన్ ప్రసంగాలు కొనసాగడం విశేషం.

జగన్ పై హిందూ వ్యతిరేక ముద్ర ఉంది. దానిని తగ్గించేందుకు ఇటీవల కొత్త పదప్రయోగం చేస్తున్నారు. అర్జునుడు, శ్రీకృష్ణుడు, దుష్ట చతుష్టయమ్ వంటి వ్యాఖ్యలు చేస్తుండడంతో హిందూ సమాజంలో ఒక రకమైన మార్పు కనిపిస్తోంది. రాప్తాడు సభలో అయితే ఫ్యాన్, సైకిల్, టీ గ్లాస్ గుర్తులు మధ్య ఆసక్తికరమైన పోలికను చెప్పి వైసీపీ శ్రేణులను ఆకర్షించారు. మధ్యలో మైక్ నొక్కడం, చొక్కా చేతులు ముడుచుకోవడం, చంద్రబాబు సంక్షేమ పథకాలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ చేతులు ఊపడం, సభకు హాజరయ్యే వారితో చేతులు ఊపించడం వంటివి ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.

సాధారణంగా సీఎం జగన్ ప్రసంగాలు అభిమానులతో పాటు ప్రత్యర్థులు కూడా చూస్తారు. అందుకే జగన్ ప్రసంగాల కోసం ప్రత్యేక రచయితలను నియమించుకున్నట్లు తెలుస్తోంది. అయితే రాతల్లో బలం ఉన్నప్పటికీ.. వాటిని చదివే విషయంలో జగన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారన్న విమర్శ ఉంది. ఆయన ప్రసంగం కృత్రిమంగా ఉండడంతో పాటు విపక్షంలో ఉన్న దూకుడు కనిపిస్తోంది. అది మైనస్ గా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

చంద్రబాబు ప్రసంగాలు ఇటీవల గణనీయంగా మార్పు సాధించాయి. ఓ సీనియర్ పొలిటీషియన్ గా ఉన్న చంద్రబాబు ఇటీవల ఓ డైలాగ్ విసిరారు. కుర్చీ మడత పెట్టి లాంటి డైలాగులు వాడడం జనాలను ఆకర్షించడమే. రాజకీయాల్లో ఇది కొత్త ట్రెండ్ కూడా. అయితే బలమైన స్క్రిప్ట్ ఉన్నా.. వాటిని చదివే సమయంలో మాత్రం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. స్పాంటేనిస్ గా ఈ ప్రసంగాలు సాగించాల్సిన అవసరం ఉంది. లేకుంటే అవి విఫల ప్రయత్నాలుగా మారే అవకాశం ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular