Perni Nani Threats Controversy: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీలో యాక్టివ్ గా ఉన్న నాయకుల్లో పేర్ని నాని ఒకరు. అయితే ఆయన చాలా దూకుడుగా మాట్లాడతారు. జాగ్రత్తగా మాట్లాడుతునే ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేస్తుంటారు. ఆయన కుమారుడు సైతం ఇప్పుడు అదే మాదిరిగా వ్యవహరిస్తున్నారు. కానీ అధికారులే లక్ష్యంగా ఆ తండ్రి కొడుకులు గట్టి హెచ్చరికలు పంపుతున్నారు. మచిలీపట్నంలో కొన్ని కాలనీలో ఆక్రమణలను తొలగించే పనిలో పడ్డారు అధికారులు. కానీ ఈ తండ్రి కొడుకులు ఒక్కసారిగా విరుచుకుపడిన తీరు చూస్తుంటే మాత్రం ఆశ్చర్యం వేస్తోంది. ముఖ్యంగా ఆయన కుమారుడు కిట్టు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఓ సీఐ స్థాయి అధికారిపై దూసుకు వెళ్లారు. తనదైన శైలిలో బాడీ లాంగ్వేజ్ తో అధికారిని దూషించినంత పని చేశారు.
* సిఐ స్థాయి అధికారితో కిట్టు వాగ్వాదం..
పేర్ని నాని( perni Nani ) కామెంట్స్ చాలా ఘోరంగా ఉంటాయి. అదే సమయంలో బ్యాలెన్స్ గా కూడా ఉంటాయి. తండ్రి ఫార్ములాను అనుసరించాలని చూస్తున్నారు కిట్టు. కానీ అంత అనుభవం లేదు కదా కుర్రతనం బయటపడుతోంది. ఏకంగా సీఐ స్థాయి అధికారిని బెదిరించేందుకు ముందుకు దూసుకొచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు పేర్ని నాని మీడియా సమావేశంలో మాట్లాడుతూ డిప్యూటీ తహసిల్దార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మేము అధికారంలోకి వచ్చాక ఇదే పోలీసులతో నీ ఇల్లు కూలగొట్టిస్తా అంటూ పేర్ని నాని వ్యాఖ్యానించడం విమర్శలకు గురిచేస్తోంది.
* జగన్ మాదిరిగానే..
జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy )ఇదే విషయంపై చాలాసార్లు హెచ్చరికలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన వారు సప్త సముద్రాలకు అవతల ఉన్న వదలను తేల్చి చెప్పారు. ఇప్పుడు అదే మాదిరిగా పేర్ని నాని వార్నింగ్స్ కూడా ఉన్నాయి అలానే. తెలంగాణకు బదిలీపై వెళ్లిన వదిలే ప్రసక్తి లేదని.. అక్కడ కెసిఆర్ కాళ్లు పట్టుకొని అయినా సరే వాళ్ళతో నీ ఇల్లు కూలగొట్టిస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో విస్మయం కలిగిస్తున్నాయి. ప్రతి చిన్న విషయానికి మేము వస్తాం.. మీ సంగతి తెలుస్తాం అంటూ చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే మాత్రం.. వారు ఏ స్థాయికి దిగజారి పోయారో అర్థం అవుతోంది. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అధికారులపై విరుచుకుపడుతుండడం తండ్రీ కొడుకులకు పరిపాటిగా మారిందని బందరు ప్రజలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.
