Pawan Kalyan vs Jagan: రాజకీయాల్లో ఈమధ్య కాలంలో అల్లు అర్జున్(Icon star Allu Arjun) ‘పుష్ప'(Pushpa Movie) మేనియా పాకేసింది. ఇందులోని డైలాగ్స్, మ్యానరిజమ్స్ ని సందర్భానికి తగ్గట్టు అందరూ వాడేస్తున్నారు. రీసెంట్ జగన్(YS Jagan Mohan Reddy) సత్తెనపల్లి టూర్ కి వచ్చినప్పుడు వైసీపీ కార్యకర్తలు కొన్ని ప్లకార్డులు పట్టుకొని తిరిగారు. ‘2029 వ సంవత్సరం లో మరోసారి అధికారం లోకి వస్తాము, అప్పుడు గంగమ్మ తల్లి జాతర లో వేట తలలను నరికినట్టు ‘రప్పా రప్పా’ అని నరుకుతాం ఒక్కొక్కడిని’ అనే డైలాగ్స్ ఆ ప్లకార్డులపై ఉన్నాయి. స్వయంగా అధినేత జగనే ఇటీవల కాలం లో కూటమి ప్రభుత్వానికి ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చాడు. పోలీసులను బట్టలు ఊడదీసి కొడుతాము అంటూ చెప్పుకొచ్చాడు. అధినేతనే అలాంటి వార్నింగ్స్ ఇస్తే, ఇక ఆ అధినేత ని అనుసరించే కార్యకర్తలు ఇలాంటి ప్లకార్డులు పట్టుకొని తిరగడం లో వింతేమీ ఉంది అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.
పైగా పల్నాడు జిల్లాలో 2024 ఎన్నికలు ఎంతటి ఉద్రిక్తత పరిస్థితుల మధ్య జరిగాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇరు వర్గాలు నాటు బాంబులు కూడా వేసుకున్నాయి. అలాంటి ప్రాంతంలోకి వెళ్లి ఇలా తయారైన తన కార్యకర్తలను నిన్న జగన్ తన ప్రెస్ మీట్ లో వెనకేసుకొని రావడం మరో సంచలనం అయ్యింది. సినిమా డైలాగ్ కొడితే కూడా అరెస్ట్ చేస్తారా?, మనం రాజ్యాంగ పరమైన రాష్ట్రంలోనే ఉన్నామా అంటూ చెప్పుకొచ్చాడు. అయితే జగన్ వీటిని సామర్దించడం పై ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) చాలా తీవ్రంగా ఖండించాడు. ఆయన మాట్లాడుతూ ‘చట్టాన్ని ఉల్లంఘించి ఇష్టమొచ్చినట్టు వ్యవహరించే నాయకులూ ఈమధ్య ఎక్కువ అయిపోయారు. ఇలాంటి నాయకుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. డైలాగ్స్ సినిమాల వరకు బాగానే ఉంటాయి. కానీ నిజజీవితంలో వాటిని అనుసరించడం అసాధ్యం. ప్రజల్లో భయాన్ని, అయోమయాన్ని కలిగించే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు. కచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం’ అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్.
Also Read: Pawan Kalyan: నవంబర్ నెల నుండి పవన్ కళ్యాణ్ మరో కొత్త సినిమా మొదలు..డైరెక్టర్ ఎవరంటే!
మరోపక్క అల్లు అర్జున్ అభిమానులు ఈ ఇరువురు ముఖ్య నాయకులూ తమ అభిమాన హీరో సినిమాకు సంబంధించిన డైలాగ్స్ గురించి మాట్లాడుకోవడం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా అల్లు అర్జున్ పుష్ప 2 ప్రభావం రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఎలా పాకిందో చూడండి అంటూ గర్వంగా ఆ వీడియోలను షేర్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ వైపు నిలబడి, ఆ పార్టీ కి ఓట్లు వేయడానికి కష్టపడిన అల్లు అర్జున్ అభిమానులు,వచ్చే ఎన్నికల్లో వైసీపీ కి ఓటు వేస్తాము అంటూ చెప్పుకొస్తున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ధీటైన కౌంటర్లు ఇస్తున్నారు. ఇలా గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియా లో జగన్ రప్పా రప్పా డైలాగ్ పెద్ద చర్చనీయాంశంగా మారింది.
జగన్ పర్యటనలోని’రప్పా రప్పా’ వ్యాఖ్యలపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్. చట్టాన్ని ఉల్లంఘించి మాట్లాడే నేతల పట్ల అప్రమత్తంగా ఉండాలి. డైలాగులు సినిమా వరకే బాగుంటాయి.. ప్రజాస్వామ్యంలో ఆచరణలో పెట్టడం సాధ్యపడదు. ప్రజల్లో భయం, అయోమయం రేకెత్తించే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు. -డిప్యూటీ…
— NTV Breaking News (@NTVJustIn) June 20, 2025