Pawan Kalyan criticism YCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం మెత్తబడటం లేదు. పైగా వారి ప్రయత్నాలను గుర్తించి పార్టీ శ్రేణులను అలెర్ట్ చేస్తున్నారు. తమిళనాడులో విజయ్ గెలుపుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో సంబరాలు చేసుకుంది. అంతటితో ఆగకుండా విజయ్ మాదిరిగా ఒంటరి పోరాటం చేయవచ్చు కదా అని ప్రశ్నించింది కూడా. మాజీ మంత్రి రోజా లాంటి వారు అయితే పవన్ కళ్యాణ్ ను జనాలు ఇచ్చి పడేసారంటూ విజయ్ విజయాన్ని గుర్తు చేస్తూ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విపరీతంగా ట్రోల్ చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే జనసైనికులు కూడా విజయ్ గెలుపుతో ఒంటరి పోరాటం ఆలోచన వారి మదిలో మెదిలింది. అయితే ఈ ప్లాన్ వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందన్న విషయాన్ని చాలామంది మరిచిపోయారు. సోషల్ మీడియాలో ప్రచారానికి ప్రభావితం అయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ దీనిపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి.. పార్టీ శ్రేణులకు క్లారిటీ ఇచ్చేశారు.
వైసిపి పై ఓ రేంజ్ లో..
ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అన్నంత ఈజీగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని తేల్చి చెప్పారు పవన్. తమిళనాడులో విజయ్ గెలవడం ఏంటి? వీరు సంబరాలు చేసుకోవడం ఏంటి అని అర్థం వచ్చేలా.. పరోక్ష వ్యాఖ్యలు చేశారు పవన్. అక్కడ మాదిరిగా ఏపీలో రాజకీయాలు చేస్తామంటే కుదరని పనిగా తెల్చేశారు. అక్కడ సమీకరణలు వేరు.. ఇక్కడ సమీకరణలు వేరు అన్న విషయాన్ని ప్రస్తావించారు. లేనిపోని ప్రచారాలను నమ్మవద్దని హితవు పలికారు. తప్పుడు ప్రచారాలకు ప్రభావితం కావొద్దని కూడా సూచించారు. 2019లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. మరోసారి అటువంటి పరిస్థితి తేవడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుట్రగా అభివర్ణించారు. అందుకే పార్టీ శ్రేణులకు హితోపదేశం చేశారు పవన్ కళ్యాణ్.
ప్రయత్నాలు వికటిస్తూ..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతగా జనసేన ను టార్గెట్ చేసుకుంటే.. అంతలా బదులు ఇచ్చేస్తున్నారు పవన్ కళ్యాణ్. వారి ప్రయత్నాలకు మించి అన్నట్టు ఫుల్ క్లారిటీ ఇస్తున్నారు. పొత్తు ఎందుకు ఉండాలో కూడా పార్టీ శ్రేణులకు ఒప్పిస్తున్నారు. రోజురోజుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు జఠిలం అవుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికలకు ముందు నుంచి ఇప్పటివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూనే ఉంది. టిడిపి నుంచి జనసేన ను వేరు చేసేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. చివరకు చాలామంది నేతల ద్వారా ప్రయత్నించి విఫలమయింది. దీంతో వారు జనసేన ను వీడాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అదే అజెండాతో ఉన్నారు. పొత్తు కొనసాగితేనే జనసేన అన్నట్టు వ్యవహరిస్తున్నారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ ప్రయత్నాలు కూటమిలో జనసేనను మరింత స్ట్రాంగ్ చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇచ్చి పడేయడంతో వైసిపి తోక ముడవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
