Deputy CM Pawan Kalyan
AP Ministerial Ranks: నేడు ఆంధ్ర ప్రదేశ్ సచివాలయంలో క్యాబినెట్ మీటింగ్ జరగగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మినహా, మిగిలిన మంత్రులందరూ హాజరయ్యారు. గత కొద్దిరోజుల నుండి తీవ్రమైన వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్న పవన్ కళ్యాణ్, ఈ సమావేశానికి రాలేనని రెండు రోజుల ముందే డిప్యూటీ సీఎం ఆఫీస్ నుండి ప్రకటన విడుదల చేశాడు. నేడు జరిగిన ఈ క్యాబినెట్ సమావేశంలో భవిష్యత్తులో నిర్వహించబోయే ప్రభుత్వ కార్యక్రమాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా, మంత్రుల పని తీరుపై ర్యాంకింగ్స్ కూడా ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ ర్యాంకింగ్స్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదవ స్థానానికి పడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. ఆంధ్ర ప్రదేశ్ లో జరిగే ప్రతీ అంశంపై ముఖ్యమంత్రి కంటే ఎక్కువ హైలైట్ అయిన వ్యక్తి పవన్ కళ్యాణ్ మాత్రమే.
తిరుపతి లడ్డు వ్యవహారంలో కానీ, హోమ్ మినిస్టర్ అనిత పై చేసిన వ్యాఖ్యల పరంగా కానీ, తిరుమల తొక్కిసలాట ఘటనలో టీటీడీ అధికారులను క్షమాపణలు చెప్పమని కోరడంలో కానీ, అక్రమ రేషన్ రవాణా సమయంలో సీజ్ ది షిప్ అంటూ ఆదేశాలు జారీ చేసిన విషయంలో కానీ , ఇలా ఒక్కటా రెండా ఎన్నో అంశాలపై పవన్ కళ్యాణ్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఒకానొక దశలో ఈయన దెబ్బకు లోకేష్ హైలైట్ అవ్వడం లేదని , ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు డిమాండ్ చేసారు. అయితే గత పది రోజుల నుండి పవన్ కళ్యాణ్ అసలు కనిపించడం లేదు. ప్రతీ రోజు ఎదో ఒక యాక్టివిటీ తో కనిపించే పవన్ కళ్యాణ్, ఈమధ్య క్యాంప్ ఆఫీస్ కి కూడా రావడం లేదట. కారణం ఆయన తన కుటుంబాన్ని కలిసేందుకు స్విజర్ ల్యాండ్ కి వెళ్లడం వల్లే.
వారం రోజుల పాటు ఆయన స్విజర్ ల్యాండ్ లో ఉండడం వల్ల పెండింగ్ ఫైల్స్ ఎక్కువ అయిపోయాయి. మొన్ననే ఇండియా కి తిరిగి వచ్చిన పవన్ కళ్యాణ్ కి వైరల్ ఫెవర్ సోకడంతో పెండింగ్ ఫైల్స్ సంఖ్య ఇంకా పెరిగిపోయింది. దీంతో ఆయన పదవ స్థానంలోకి పడిపోయాడు. ఇక మొదటి స్థానంలో మంత్రి ఎన్ఎండి ఫరూఖ్ ఉండగా, రెండవ స్థానంలో కందుల దుర్గేష్, మూడవ స్థానంలో కొండపల్లి శ్రీనివాస్, నాల్గవ స్థానంలో నాదెండ్ల మనోహర్, ఐదవ స్థానంలో బాల వీరాంజనేయ స్వామి కొనసాగుతున్నారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరవ స్థానం లో కొనసాగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. అదే విధంగా ఆరోగ్య శాఖా మంత్రి సత్య ప్రకాష్ 7వ స్థానం లో ఉండగా, ఐటీ శాఖా మంత్రి లోకేష్ 8వ స్థానం లోను, 9 వ స్థానంలో బీసీ జనార్దన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఇక హోమ్ మినిస్టర్ అనిత అయితే టాప్ 20 లో కూడా లేకపోవడం గమనార్హం.