Pawan Kalyan Lady Fan Viral Video: సోషల్ మీడియా అనేది నేటి కాలంలో ఒక ప్రధానమైన మాధ్యమంగా మారింది. ప్రధాన మీడియా సైతం వెనక్కినట్టి సోషల్ మీడియా దుమ్ము లేపుతోంది. సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు జనాలకు ఆసక్తికరంగా ఉంటున్నాయి. ఇందులో కొన్ని ఆలోచించే విధంగా ఉంటే… మరికొన్ని నవ్వు తెప్పించే విధంగా ఉంటున్నాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు తెగ సంచలనం సృష్టిస్తోంది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత జనం వారి వారి అభిప్రాయాలను మొహమాటం లేకుండా చెబుతున్నారు. వాటిని వ్యక్తం చేయడానికి సోషల్ మీడియాను బలమైన మాధ్యమం లాగా వాడుకుంటున్నారు. అదే జనానికి వింతగా ఉన్నవి మాత్రం ఒక్కసారిగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. ఆ తరహా వీడియోలను రూపొందించిన వ్యక్తులు సెలబ్రిటీలు అవుతున్నారు. ఇప్పటివరకు ఎంతోమంది సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీ స్టేటస్ సంపాదించుకొని భారీగా వెనకేసుకుంటున్నారు. అలాంటి జాబితాలోకి ఈ మహిళ చేరింది. ఈ మహిళ పాడే పాటలు విచిత్రంగా ఉంటాయి. పేరడీ పాటలే అయినప్పటికీ నవ్వు తెప్పిచ్చే విధంగా ఉంటాయి. ఎవరు ఎలాంటి కామెంట్లు చేసినప్పటికీ.. ఎలా మాట్లాడినప్పటికీ ఆ మహిళ మాత్రం తన ధోరణి మార్చుకోదు. పైగా కొత్త కొత్త పాటలతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తూ ఉంటుంది.
ఇటీవల జనసేన అధినేత జన్మదినం జరుపుకున్నారు. ఆయన అభిమానులు.. జనసేన నాయకులు రకరకాలుగా శుభాకాంక్షలు తెలిపారు. కానీ ఈ మహిళ మాత్రం పేరడీ పాటలతో.. జనసేన అధినేత నటించిన సినిమాల పేర్లతో ఒక పాటను రూపొందించింది. ఆ పాటను పాడుతూ.. తనకు తానే దరువు వేసుకుంటూ రక్తి కట్టించింది. ఈ పాటను చూసిన వారంతా పొట్ట పగిలే విధంగా నవ్వుతున్నారు. ఇలా కూడా పాట రూపొందిస్తారా.. ఇలా కూడా పాడుతారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. గతంలో ఈ మహిళ అనేక పాటలను ఇదేవిధంగా రూపొందించింది. సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. మళ్లీ ఇప్పుడు జనసేన అధినేత జన్మదిన సందర్భంగా పాటను రూపొందించి సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది. ఆమె పాడిన పాటను చాలామంది అభినందిస్తూనే అక్కా నువ్వు మళ్ళీ వచ్చావా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Orey pic.twitter.com/Be6TG4mUe2
— HarshaVardhan (@Harsha2_) September 5, 2025