https://oktelugu.com/

Pawan Kalyan : మహేష్ బాబు తండ్రి కృష్ణ చనిపోయి దుఃఖంలో ఉంటే జగన్ వెళ్లి నవ్వుతాడు – పవన్ కళ్యాణ్

అధికార పార్టీకి సంబంధించిన ఎమ్యెల్యేలు , మంత్రులు సమాధానాలు చెప్పలేక బిక్కమొహం వేయడాన్ని జనాలు గమనిస్తూనే ఉన్నారు. ఇది నిజంగా వైసీపీ పార్టీ కి తీవ్రమైన నష్టాన్ని కలుగచేసే విషయం అని చెప్పాలి.

Written By: , Updated On : July 12, 2023 / 10:08 PM IST
Follow us on

Pawan Kalyan : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర తో ముందుకు దూసుకుపోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ యాత్ర ద్వారా ఆయన రీసెంట్ గా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపుతూ కాగ్ మరియు RTI రిపోర్ట్స్ అందించిన అధికారిక నివేదికలను చేతిలో పెట్టుకొని ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను , దోచేస్తున్న డబ్బుల లెక్క గురించి వేలాది మంది హాజరై ఉన్న సభలలో చెప్పడం పెద్ద సంచలనాలకు దారి తీస్తుంది.

అధికార పార్టీకి సంబంధించిన ఎమ్యెల్యేలు , మంత్రులు సమాదానాలు చెప్పలేక బిక్కమొహం వేయడాన్ని జనాలు గమనిస్తూనే ఉన్నారు. ఇది నిజంగా వైసీపీ పార్టీ కి తీవ్రమైన నష్టాన్ని కలుగచేసే విషయం అని చెప్పాలి. ఇక రీసెంట్ గా ఆయన వాలంటీర్ వ్యవస్థ పై చేసిన కొన్ని కామెంట్స్ పెను దుమారాన్నే రేపాయి, ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో ఏ ఇద్దరు మాట్లాడుకున్నా దీని గురించే మాట్లాడుకుంటున్నారు.

Pawan Kalyan Comments On Mahesh Babu over CM YS Jagan at Krishna House | Tadepalligudem Meeting

ఇక నేడు తాడేపల్లి గూడెం లో పవన్ కళ్యాణ్ నిర్వహించిన బహిరంగ సభ లో పవన్ కళ్యాణ్ మరోసారి వాలంటీర్ వ్యవస్థ పై సంచలన కామెంట్స్ చేసాడు. అంతే కాకుండా తన పై వ్యక్తి గత ఆరోపణలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ పై పవన్ కళ్యాణ్ మరోసారి చాలా తీవ్రంగా తిప్పికొట్టాడు. ఆయన మాట్లాడుతూ ‘ మాటికొస్తే మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి మొన్న చిన్న పిల్లల మీటింగ్ లో మాట్లాడుతాడు. ప్రతీసారి పెళ్ళాం పెళ్ళాం అని సంభోదిస్తాడు, ఎవరైనా గౌరవం తో భార్య అని కానీ, లేదా సతీమణి అని కానీ పిలుస్తారు. కానీ మన ముఖ్యమంత్రి సంస్కార హీనుడు కదా, ఇవన్నీ ఏమి తెలియదు. నోటికి వచ్చినట్టు మాట్లాడుతాడు, మొన్న మహేష్ బాబు గారి నాన్న చనిపోయినప్పుడు అక్కడి వచ్చి నవ్వుతాడు, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియని దిగజారుడు వ్యక్తి మన ముఖ్యమంత్రి ‘ అంటూ పవన్ కళ్యాణ్ మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డాడు.