Nagababu Minister Post: రాజకీయంగా కొన్ని నిర్ణయాలు సమయానుకూలంగా జరుగుతుంటాయి. మెగా బ్రదర్ నాగబాబు( Mega brother Naga babu ) విషయంలో అలానే జరిగింది. వాస్తవానికి ఆయన అనకాపల్లి ఎంపీ స్థానానికి పోటీ చేయాలని భావించారు. అందుకే ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అదే నియోజకవర్గ పరిధిలోని ఎలమంచిలి లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు కూడా. కానీ మూడు పార్టీల మధ్య పొత్తులో భాగంగా ఆ సీటు బిజెపికి కేటాయించడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. కూటమి తరుపున సమన్వయ బాధ్యతలు తీసుకున్నారు. అయితే రాజ్యసభ పదవుల ఎంపిక సమయంలో జరిగిన సమీకరణల మూలంగా నాగబాబుకు అవకాశం దక్కలేదు. అందుకే నాగబాబును ఏపీ క్యాబినెట్ లోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. గత ఏడాది డిసెంబర్ 9న ట్వీట్ చేశారు. కానీ అది ఏడాది అవుతున్న ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.
వైసీపీలో టెన్షన్..
నాగబాబును ఎందుకు మంత్రి చేయలేదు? తెలుగుదేశం పార్టీ కంటే వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) లోనే ఎక్కువ టెన్షన్ ఉంది దీనిపై. అయితే నాగబాబు మంత్రి అనేసరికి ఏదో ఒక వ్యూహం ఉంటుందని అందరూ ఆలోచించారు. ఎందుకంటే క్యాబినెట్లో ఇద్దరు సోదరులు మంత్రులుగా ఉంటే తప్పకుండా విమర్శలు వస్తాయి. ఆ విషయం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కు తెలియంది కాదు. అయినా నాగబాబును క్యాబినెట్ లోకి తీసుకున్నామని చెప్పారు అంటే దాని వెనుక ఏదో ఒకటి ఉంటుంది. అయితే ఆ ప్రకటన వచ్చిన తర్వాత నాగబాబు కూడా దూకుడు తగ్గించారు. పెద్దగా మాట్లాడటం లేదు. అవసరానికి తగ్గట్టుగానే మాట్లాడుతున్నారు. ఎందుకంటే రాజకీయాల్లో లేనప్పుడే నాగబాబు పొలిటికల్ కామెంట్స్ చేసేవారు. అటువంటిది కాబోయే మంత్రి హోదాలో ఎన్నెన్నో ప్రకటనలు చేయాలి. కానీ అలా చేయలేదు. దీని వెనుక పవన్ ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఆ ఆలోచనలో పవన్..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ డిఫెన్స్ లో పెట్టాలన్నది పవన్ కళ్యాణ్ ఆలోచన. అందుకోసం ఆయన ఏ అవకాశాన్ని విడిచిపెట్టరు. జనసేన తో పాటు ఆ పార్టీ నుంచి వివాదాస్పద నిర్ణయాలను కోరుకుంటుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఆ అవకాశం ఇవ్వదలుచుకోలేదు పవన్. అందుకే పార్టీలో ప్రత్యేక లైన్ గీసారు. నాగబాబు స్థానంలో కొత్త వ్యక్తికి పార్టీ పగ్గాలు ఇచ్చారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మాత్రం ఎందుకో పవన్ ముందు జాగ్రత్త పడినట్లు కనిపిస్తోంది. మరో 15 ఏళ్ల పాటు కూటమి ఉంటుందని ఆయన గట్టిగానే చెబుతున్నారు. దానికి జనసేన అడ్డుకాకూడదు అని పవన్ ప్లాన్ గా తెలుస్తోంది. అందుకే నాగబాబు వ్యూహాత్మక సైలెంట్ పాటిస్తున్నట్లు సమాచారం. సరైన సమయంలో మంత్రివర్గంలోకి నాగబాబు ఎంట్రీ ఇవ్వడం ఖాయం. కానీ అందర్నీ డిఫెన్స్ లో పెట్టి క్యాబినెట్లో ఇద్దరు సోదరులకు మంత్రి పదవి ఇచ్చారన్న విమర్శ హైలెట్ కాకూడదు అన్నది వ్యూహంగా తెలుస్తోంది.