Nara Lokesh: సోషల్ మీడియాలో( social media) ఏపీ మంత్రి నారా లోకేష్ చాలా యాక్టివ్ గా ఉంటారు. అందుకే అత్యవసర సమయాల్లో ఎక్కువమంది ఆయనను ఆశ్రయిస్తుంటారు. విదేశాల్లో ఉంటూ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటే ముందుగా గుర్తొచ్చే పేరు నారా లోకేష్. అయితే పాలనలోనూ సైతం తన మార్కు చూపిస్తున్న లోకేష్ సోషల్ మీడియా ద్వారా ఎన్నో విషయాలను సామాన్య ప్రజలతో పంచుకుంటారు. భారీగా పెట్టుబడులు వచ్చిన సమయంలో సైతం నారా లోకేష్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు విపరీతంగా వైరల్ అవుతుంటాయి. తాజాగా ఆయన పెట్టిన పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతుంది. గెట్ రెడీ వైజాగ్.. ఈరోజే అంటూ ట్వీట్ చేసిన లోకేష్.. ఎవరో గెస్ చేయండి అంటూ చిన్నపాటి పజిల్ కూడా పెట్టారు. టిసిఎస్ వంటి కంపెనీలు విశాఖలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన సమయంలో కూడా నారా లోకేష్ ఇదే తరహాలో సోషల్ మీడియా ద్వారా సర్ప్రైజ్ అంటూ ప్రకటించారు. ఇప్పుడు మరోసారి దానిని గుర్తు చేస్తున్నారు నెటిజన్లు.
* వారి రాక కోసమేనా?
అయితే మంత్రి నారా లోకేష్( Minister Nara Lokesh ) చేసిన ట్వీట్ ఇప్పుడు ప్రజల్లో చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా మహిళా క్రికెట్ జట్టు గురించి అయి ఉంటుందని అంచనాలు వెల్లడిస్తున్నారు. భారత మహిళా క్రికెట్ జట్టు ఇటీవల వన్డే ప్రపంచ కప్ నెగ్గిన సంగతి తెలిసిందే. అయితే శ్రీలంక మహిళ క్రికెట్ జట్టు భారత్లో పర్యటించనుంది. విశాఖ వేదికగా రెండు టీ20 మ్యాచ్లు ఆడనుంది. డిసెంబర్ 21, 23 తేదీలలో విశాఖలో ఏసీఏ, వీడిసిఎ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్లు జరగనున్నాయి. అయితే నారా లోకేష్ చేసిన ట్వీట్ దీని గురించి అని ఎక్కువ మంది అంచనాకు వస్తున్నారు. మరికొందరైతే అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనాల్ మెస్సి తరహాలో ఎవరైనా వస్తున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల మెస్సి హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి ఫుట్బాల్ మ్యాచ్ ఆడారు. అటువంటిదేమైనా విశాఖలో ఉంటుందా అనే చర్చ లోకేష్ ట్వీట్ తో మొదలయింది.
* ఐటీ హబ్ గా విశాఖ..
విశాఖను ఐటి హబ్ గా( IT hub) మార్చాలనుకుంది కూటమి ప్రభుత్వం. ఇందులో కొంత సక్సెస్ అయ్యింది. ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖ రానుంది. ఒప్పందం కూడా పూర్తయింది. ఐటీ అనుబంధ పరిశ్రమలు వెల్లువలా వస్తున్నాయి. కొన్ని సంస్థలు శాశ్వత కార్యాలయాలకు సంబంధించిన భవన నిర్మాణాలను మొదలుపెట్టాయి. పెద్ద ఎత్తున భూ కేటాయింపులు కూడా జరిగాయి ఐటి సంస్థలకు. ఇటువంటి పరిస్థితుల్లో మంత్రి నారా లోకేష్ ఈ ట్వీట్ చేయడం విపరీతంగా వైరల్ అవుతుంది. ప్రజల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. అయితే ఇంకా గంట వ్యవధి మాత్రమే ఉంది. దీంతో ఎలాంటి అద్భుతం జరగబోతోంది అనేది హాట్ టాపిక్ అవుతుంది. మొత్తానికి అయితే మంత్రి నారా లోకేష్ తన ట్వీట్ తో అంతటా చర్చకు తెర లేపారు. చూడాలి మరి అది ఎలాంటి అద్భుతమో..
#Vizag, get ready. The world champions are coming this month.
Any guesses who?— Lokesh Nara (@naralokesh) December 15, 2025