Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh: లోకేష్ తలచుకుంటే అంతే!

Nara Lokesh: లోకేష్ తలచుకుంటే అంతే!

Nara Lokesh: చిన్నారి పునర్విక( punarvika ) విషయంలో మానవత్వం వెల్లివిరిసింది. దాతృత్వంతో ఆ చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. అయితే ఏపీ మంత్రి నారా లోకేష్ భారీ విరాళాన్ని సర్దుబాటు చేసేందుకు ముందుకు రావడం పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కర్నూలు జిల్లాకు చెందిన పునర్వికకు 11 నెలలు. కోట్లాదిమందిలో ఒకరికి వచ్చే అత్యంత అరుదైన వ్యాధికి గురయ్యారు చిన్నారి. నిరుపేద కుటుంబం కావడంతో వైద్యం అతి కష్టంగా మారింది. దాదాపు 16 కోట్ల రూపాయల విలువైన ఇంజక్షన్ వేస్తే కానీ ఆ పాప బతకదు. ఇటువంటి సంక్లిష్ట సమయంలో సోషల్ మీడియా వేదికగా ఆ సాయం పోగు అయింది. త్వరలో పునర్విక ఆపరేషన్ జరగనుంది.

Also Read: తిరుమల పవిత్రతకు వైఎస్ ఫ్యామిలీతో చేటు.. కడిగిపారేసిన చంద్రబాబు

* భారీగా దాతలు..
పునర్విక తండ్రి సురేష్ కుమార్( Suresh Kumar) చిరు వ్యాపారి. అటువంటి ఇంట్లో పుట్టిన పునర్విక అత్యంత అరుదైన వ్యాధికి గురైంది. దాదాపు 16 కోట్ల రూపాయల ఇంజక్షన్ వేయాల్సి ఉంది. ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఆ కుటుంబం అల్లాడిపోయింది. ఇటువంటి సమయంలో సోషల్ మీడియా బాధ్యత తీసుకొని దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం కల్పించింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు దీనిపై ప్రచారం చేయడంతో దాతలు స్పందించారు. దాదాపు పది కోట్ల రూపాయల వరకు సాయం అందింది. మరో 6 కోట్ల రూపాయల వరకు అవసరం అయింది. ఈ తరుణంలో నారా లోకేష్ స్పందించినట్లు తెలుస్తోంది. 6 కోట్ల రూపాయల సాయం సర్దుబాటు చేయడమే కాకుండా అమెరికా నుంచి అరుదైన ఇంజక్షన్ తెప్పించేందుకు రంగంలోకి దిగినట్లు సమాచారం.

* ప్రభుత్వాలు ముందుకు రావు..
సాధారణంగా ఇంత భారీ మొత్తంలో సాయం చేసేందుకు ప్రభుత్వాలు ముందుకు రావు. రకరకాల సాంకేతిక సమస్యలు చూపి తప్పించుకుంటాయి. కానీ నారా లోకేష్( Minister Nara Lokesh ) మాత్రం కేవలం రాజకీయ కోణంలోనే ఈ అంశాన్ని చూడలేదు. సెంటిమెంట్ తో కూడిన కుటుంబ అంశంగా భావించి భారీ మొత్తం సాయం చేసేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. రూపాయి ఇస్తే హంగామా చేసే ఈ రోజుల్లో 6 కోట్ల రూపాయలు సర్దుబాటు చేయడం అంత సులువైన పని కాదు. కానీ ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా నిరూపించుకున్నారు నారా లోకేష్. కేవలం డబ్బులు సర్దుబాటు కాకుండా.. అమెరికాలో లభించే అరుదైన ఇంజక్షన్ ను ఇక్కడకు తెప్పించి పునర్వికకు వైద్యం అందించే బాధ్యతను కూడా నారా లోకేష్ తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నిజమైన లీడర్ అంటే ఇలా ఉండాలి అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular