Nara Lokesh: మంత్రి నారా లోకేష్ కు( Nara Lokesh) ప్రమోషన్ తప్పదని తెలుస్తోంది. ఈ ఏడాదిలోగా ఆయన మంత్రి నుంచి మరో పదోన్నతి పొందనున్నారని సమాచారం. అయితే ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టినట్టు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి. సెలబ్రిటీల జ్యోతిష్యుడుగా పేరు తెచ్చుకున్నారు ఆయన. ఆయన చాలాసార్లు చెప్పిన జోష్యం ఫలించింది. కానీ పొలిటికల్ జోష్యం చెప్పిన తర్వాత.. చాలాసార్లు ఆయన అంచనాలు తప్పాయి. అస్సలు జోష్యాలు ఫలించలేదు. దీంతో ఇక పొలిటికల్ జోష్యాలు చెప్పనని తేల్చి చెప్పారు వేణు స్వామి. కానీ యూట్యూబ్ ఇంటర్వ్యూలో తాజాగా పలు విషయాలను వెల్లడించారు. 2026లో నారా లోకేష్ ప్రమోషన్ ఖాయమని తేల్చేశారు. అంటే ఆయన డిప్యూటీ సీఎం పదవి చేపడతారని చెప్పుకొస్తున్నారు.
* సెలబ్రిటీలకు జోష్యం..
వేణు స్వామి( Venu Swami) సినీ సెలబ్రిటీలకు జోష్యం చెప్పేవారు. ఆయన జోష్యం వాస్తవానికి దగ్గరగా ఉండేది అని పేరు ఉండేది. కానీ క్రమేపి ఆయన పొలిటికల్ జోష్యం చెప్పడం ప్రారంభించారు. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి పదవి అందుకుంటారని జోష్యం చెప్పారు. కానీ ఘోర పరాజయం చవి చూశారు. అంతకుముందు కెసిఆర్ విషయంలో కూడా ఆయన జోష్యం తప్పింది. దీంతో వేణు స్వామి సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురయ్యారు. ఇకనుంచి రాజకీయ జోష్యాలు చెప్పనని ప్రకటించారు. కానీ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు, కెసిఆర్, జగన్, పవన్, లోకేష్ ల గురించి జోష్యం చెప్పారు. అది కూడా ఈ ఏడాది గురించి.
* పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా
ముఖ్యంగా నారా లోకేష్ కు ప్రమోషన్ ఖాయం అని.. ఈ ఏడాది ఆయనకు పదోన్నతి ఇస్తారని వేణు స్వామి చెప్పడం ద్వారా సరికొత్త చర్చకు తెర తీసినట్లు అయ్యింది. అయితే లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారా? లేకుంటే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారా? అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఒక్కరే డిప్యూటీ సీఎం గా ఉన్నారు. కూటమి కట్టడంతో పాటు జనసేన అధినేతగా ఆయనకు తగినంత గౌరవం ఇచ్చారు చంద్రబాబు. ఇప్పుడు ఆయన పక్కలో మరో డిప్యూటీ సీఎం గా లోకేష్ కు అవకాశం ఇస్తారా? లేకుంటే ముందుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెడతారా? అన్నది చూడాలి.