Political Leaders: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో.. విభజిత తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి నేతలు మొన్నటి వరకు పాదయాత్రలు చేశారు. ప్రజల్లోకి వెళ్లడం నేతలకు కలిసి వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలను గెలిపిస్తోంది. నేతలను సీఎంలను చేస్తోంది. 2003లో వైఎస్‌ఆర్ చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డీలాపడిన కాంగ్రెస్‌కు కొత్త ఉత్సాహం తెచ్చింది. 2004లో అధికారంలోకి వచ్చింది. వైఎస్సార్ సీఎం అయ్యారు. ఇక 2013లో జగన్ కూడా ఏపీలో పాదయాత్ర చేశారు. అయితే 2014లో అధికారంలోకి రాలేదు. 2018 మళ్లీ యాత్ర చేశారు. ఈసారి అధికారం వరించింది. జగన్ సీఎం అయ్యారు. ఇక 2022లో తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రం కాంగ్రెస్‌ను పదేళ్ల తర్వాత ఎలంగాణలో అధికారంలోకి తెచ్చింది. అయితే భట్టి సీఎ కాలేదు. డిప్యూటీ సీఎంతో సరిపెట్టుకున్నారు. ఇక 2024ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర చేశారు. దీంతో ఆశించిన ఫలితాలు వచ్చాయి. టీడీపీ మళ్లీ పుంజుకుంది. అధికారం చేపట్టింది. చంద్రబాబు సీఎం అయ్యారు. లోకేశ్ ముఖ్యమై మంత్రి అయ్యారు.
జైల్లోకి వెళ్లినా..
ఇక జైలుకు వెళ్లినా సీఎం అవుతామనే అభిప్రాయం ఉంది. జైలుకు వెళితే పవర్ ఫుల్ అని నేతలు భావిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, నారా చంద్రబాబు నాయకుడు, వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జైలుకు వెళ్లొచ్చాక సీఎం అయ్యారు. పాదయాత్ర చేయడం కష్టమైన పని, జైలుకు వెళ్లడం ఈజీ బాగా విశ్రాంతి దొరకడంతోపాటు మైలేజీ వస్తుంది. ఇది కేసీఆర్, జగన్‌కు బాగా అర్థమైంది. రేవంత్‌ను అరెస్టు చేయించిన కేసీఆర్ పార్టీని గెలిపించలేదు. చంద్రబాబును అరెస్ట్ చేసి జగన్ కూడా పార్టీని గెలిపించలేకపోయారు. దీంత ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు కీలక నేతుల జైలుకు వెళ్లాలని తహతహలాడుతున్నారు.
కేటీఆర్, జగన్ ఉత్సాహం..
రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలకంగా ఉన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వైసీపీ అధినేత జగన్ తాము మళ్లీ అధికారంలోకి రావాలంటే పాదయాత్ర చేయాలి లేదా జైలుకు వెళ్లాలని భావిస్తున్నారు. పాదయాత్ర ఇప్పుడు కష్టంగా ఉంది. దీంతో జైలుకు వెళ్లడమే మేలని భావిస్తున్నారు. ఇందుకు తహతహలాడుతున్నారు. ఉత్సాహం చూపుతున్నారు. ఫార్ములా–1 ఈ రేసింగ్ వ్యవహారంలో తాను జైలుకు వెళ్లడానికి రెడీ అని కేటీఆర్ అంటున్నారు. జైల్లో యోగా చేసి ఫిట్‌గా మారి రెండు నెలల్లో బయటకు వస్తానని చెప్పుకుంటున్నారు. తర్వాత పాదయాత్ర చేస్తానని అంటున్నారు.
బిగుస్తున్న ఉచ్చు..
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఫార్ములా రేసు కేసుతోపాటు తాజాగా వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్‌పై దాడి కేసులో కేటీఆర్‌ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈమరకు బీఆర్‌ఎస్ న నేతలు కూడా మానసికంగా సిద్ధమవుతున్నారు. ఏరోజైనా కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది.
ఏపీలో జగన్..
ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం ౖÐð సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తోంది. దీంతో వైసీపీ అధినేత జగన్.. తాడేపల్లి ప్యాలెస్‌లో మీడియా సమావేశం నిర్వహించి సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఎంత మందిని అరెస్టు చేసినా ప్రశ్నించడం ఆగదని హెచ్చరించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని నిలదీస్తూనే పోస్టులు పెట్టాలి అని సూచించారు. అరెస్ట్ అయితే పార్టీ అండగా ఉంటుందని వెల్లడించారు. అరెస్టు చేయదలిస్తే.. ముందుగా తనతోనే మొదలు పెట్టాలని జగన్ సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఇక అసెంబ్లీలో అడుగు పెడితే అనర్హత వేటు వేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. దమ్ముంటే అనర్హత వేటు వేయాలని సవాల్ చేశారు.
కేడర్‌లో ఊపు తెచ్చేందుకే..
ఎన్నికల్లో ఓటమితో బీఆర్‌ఎస్, వైసీపీలు రెండు రాష్ట్రాల్లో డీలా పడ్డాయి. వాటిని జాకీలు పెట్టి లేపేందుకు నేతలు యత్నిస్తున్నారు. క్యాడర్‌లో ధైర్యం నింపేందకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో చిన్న నేతల అరెస్టుతో లాభం ఉండదని, తాము జైలుకు వెళితే పార్టీల్లో భావోద్వేగాలు రగిలి మళ్లీ ఉత్సాహం వస్తుందని కేటీఆర్, జగన్ భావిస్తున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Leaders in a hurry to go to jail
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com