Land Registration: ఏపీ( Andhra Pradesh) ప్రజల కనీస డిమాండ్లపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. వారసత్వ ఆస్తులు, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత సులభతరం చేసింది. గ్రామ సచివాలయాల్లోనే ఈ భూముల బదలాయింపు ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించింది. కేవలం 100 రూపాయల ఖర్చుతో ఈ భూములను వారసులకు బదులయించేలా రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఎమ్మార్వో కార్యాలయాలతో పాటు ఆర్టీవో కార్యాలయాలు చుట్టు తిరగాల్సి వచ్చేది ఈ వారసత్వ ఆస్తుల కోసం. కానీ ఇప్పుడు అవేవీ అవసరం లేకుండా గ్రామ వార్డు సచివాలయాల్లోనే ఈ తతంగం పూర్తయ్యేలా చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఇది చాలా సానుకూల నిర్ణయం కాగా.. ఏపీ ప్రజలకు ఎంతో ఉపయోగపడే అంశం కూడా..
3 లక్షలకు పైగా దరఖాస్తుల పెండింగ్..
రాష్ట్రంలో 3 లక్షలకు పైగా ఇలాంటి వివాదాస్పద, వారసత్వ భూములకు సంబంధించిన దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని మార్కెట్ విలువలో పది లక్షల రూపాయలు ఉంటే వంద రూపాయలతో వారసత్వ భూముల బదలాయింపు జరిగేలా ఏపీ ప్రభుత్వం( AP government) నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల పత్రాలు గ్రామంలోని డిజిటల్ అసిస్టెంట్కు సమర్పిస్తే.. సచివాలయ ఉద్యోగులు పరిశీలించి దానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అన్ని సరిపోయాయని భావిస్తే వారసుల పేరుతో ఈ పాస్బుక్ జారీ అవుతుంది. అన్ని రకాల యాజమాన్య హక్కులు వారసులకు వస్తాయి. భూ యజమాని మరణం తర్వాత రకరకాల కారణాలు చెప్పి వారసులకు భూబదలాయింపులు జరగడం లేదు. ఆ ఫిర్యాదులతోనే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఆ అనుభవంతో..
గతంలో భూ వ్యవహారాలే జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy ) రాజకీయంగా నష్టం తెచ్చిపెట్టాయి. పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టడం పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. అందుకే ప్రభుత్వం ఇటువంటి భూముల వివాదాలపై వెనువెంటనే ఒక పరిష్కార మార్గం చూపించాలని నిర్ణయించింది. అందుకే గ్రామ వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను తక్కువ ధరకే అందిస్తోంది. మరణ సర్టిఫికెట్, లీగల్ హెయిర్ సర్టిఫికెట్, ఆధార్, ఆస్తి డాక్యుమెంట్లు, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ వంటివి సమర్పిస్తే 100 రూపాయలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు సచివాలయ ఉద్యోగులు. ఇప్పటికే దీనిపై ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అయితే ప్రయోగాత్మకంగా కొన్ని సచివాలయాల్లో ప్రారంభిస్తారు. అక్కడ సక్సెస్ అయితే మిగతా ప్రాంతాలకు సైతం విస్తరిస్తారు.