Homeఆంధ్రప్రదేశ్‌Kodali Nani : ఎవ్వరూ ఊహించని లుక్ లోకి మారిపోయిన కొడాలి నాని.. పిక్ వైరల్

Kodali Nani : ఎవ్వరూ ఊహించని లుక్ లోకి మారిపోయిన కొడాలి నాని.. పిక్ వైరల్

Kodali Nani : వైసిపి ఫైర్ బ్రాండ్లలో కొడాలి నాని ఒకరు.చంద్రబాబుతో పాటు లోకేష్ లపై పడడంలో ముందుండేవారు.వైసిపి ప్రభుత్వం లో తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారు.బూతులు మాట్లాడే వారు.చంద్రబాబు మాట వింటేనే ఫైర్ అయ్యేవారు.అయితే ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో మునుపటి దూకుడును తగ్గించారు.పెద్దగా మీడియాలో సైతం కనిపించడం మానేశారు.దీంతో కొడాలి నాని పై అనేక రకాల ప్రచారం సాగింది.అయితే ఇటీవల మీడియా ముందుకు వచ్చికూటమి ప్రభుత్వంపై కామెంట్స్ చేస్తున్నారు.ఈరోజు ఉన్నపలంగా తిరుమలలో దర్శనమిచ్చారు కొడాలి నాని. ఎప్పుడూ గుబురు గడ్డంతో కనిపించే నాని..ఒక్కసారిగా గుండు అయ్యారు. న్యూ లుక్ తో కనిపించారు.తిరుమల శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించారు.ఆయన ప్రత్యేక తిరుమల వెళ్తుంటారు.ఇదే విషయాన్ని ఇటీవల చెప్పుకొచ్చారు.తిరుమలలో వివాదం నేపథ్యంలో చంద్రబాబుపై కామెంట్స్ చేశారు నాని.ఆయన ఏనాడైనా తిరుమలలో తలనీలాలు సమర్పించుకున్నారా అని ప్రశ్నించారు.ఇప్పుడు అదే తిరుమలలో శ్రీవారికి తలనీలాలు సమర్పించి..గతానికి భిన్నంగా కనిపించారు కొడాలి నాని. వైసిపి ఓడిపోయిన నాటి నుంచి నాని లో దూకుడు తగ్గింది.గుడివాడలో సైతం పెద్దగాకనిపించడం లేదు.విజయవాడకు పరిమితమైనట్లు తెలుస్తోంది.

* తరచూ వివాదాస్పద కామెంట్స్
ఎన్నికలకు ముందు చాలా రకాల వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆయన కాలి వద్ద ఉండిపోతానని..బూట్లు తుడుస్తానని అప్పట్లో సంచలన వ్యాఖ్యలుచేశారు.కుప్పంలో సైతం చంద్రబాబు ఓడిపోతున్నారని కామెంట్ చేశారు.అయితే కూటమి అంతులేని మెజారిటీతో గెలవడంతో నాని టార్గెట్ అయ్యారు. ఆయన ఇంటికి వెళ్లి మరి తెలుగు యువత నాయకులు సవాల్ చేశారు. కోడిగుడ్లతో దాడి చేశారు.రాజకీయ సన్యాసం ఎప్పుడు చేస్తావని ప్రశ్నించారు.చంద్రబాబు బూట్లను ఎప్పుడు తుడుస్తావు అంటూ ఎద్దేవా చేశారు.

* వరుసగా కేసులు నమోదు
గుడివాడలో కొడాలి నాని అనుచరుల చేతుల్లో ఉన్న భూములను..అసలు యజమానులకు అప్పగించింది కూటమి ప్రభుత్వం. కొడాలి నాని పై గెలిచిన వెనిగండ్ల రాము ఈ విషయంలో దూకుడుగా ఉన్నారు. మరోవైపు కొడాలి నాని పై పాత కేసులు నమోదవుతున్నాయి. ఆయన ఏదో ఒక రోజు అరెస్ట్ అవుతారని ప్రచారం సాగుతోంది.అయితే కొడాలి నాని మాత్రం తరచూ కనిపిస్తున్నారు.మీడియా ముందుకు వస్తున్నారు. కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా తన పాత లుక్ ను వదిలేసి.. కొత్త లుక్ తో కనిపించడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version