KCR- AP TDP Leaders: కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు ఇప్పుడు ఏపీలో కూడా హీటెక్కిస్తోంది. ఆ పార్టీలోకి ఏపీ నేతలు భారీగా క్యూకడుతున్నారన్న వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చడం కేసీఆర్ ఇష్టం. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో విస్తరించే పనిలో ఆయన ఉన్నారు. ప్రధానంగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక, ఏపీపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అయితే మిగతా రాష్ట్రాలు ఒక ఎత్తు. ఏపీ మరో ఎత్తు. ఇక్కడి ప్రజలు కేసీఆర్ ను యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో అయితే లేరు. కానీ నాయకులు చేరడానికి సిద్ధమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. చాలా రోజుల నుంచే కేసీఆర్ ఆంధ్రా రాజకీయాల్లోకి తమకు రమ్మంటున్నారంటూ ప్లీనరీ వేదికగా చెప్పుకొచ్చారు.కానీ అప్పట్లో అందరూ లైట్ తీసుకున్నారు. అయితే తాజాగా కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనతో అదే నిజమని తేలింది. అయితే కేసీఆర్ ను ఆహ్వానించిన నాయకులెవరు? వారు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారన్నదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. కొద్దిరోజుల కిందట విశాఖ వచ్చిన కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ బ్యానర్లు వెలిశాయి. అంటే ఏపీలో కేసీఆర్ పార్టీ ఎంట్రీకి అప్పుడే బీజం పడిందని రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఏపీ ప్రజల్లో మాత్రం కేసీఆర్ పై సానుకూలత లేదు. ఆంధ్రులను దూషిస్తూ…ఆంధ్ర మీద ధ్వేషం ప్రదర్శిస్తూ కేసీఆర్ సుదీర్ఘ కాలం తెలంగాణ ఉద్యమాన్ని నడిపారు. ఇప్పటికీ విభజన సమస్యలు కొలిక్కి రాలేదు. అనేక విషయాల్లో తెలంగాణ ప్రభుత్వం అనేక ఇబ్బందులను పెడుతునే ఉంది. నీటి నుంచి కరెంట్ వరకూ మడత పెచీ వేస్తూ.. సమస్యలను పెంచుతూనే ఉంది. టీఆర్ఎస్ సర్కారు ఏపీని అన్ని విధాలా అన్యాయం చేస్తోందన్న బాధ ఏపీ ప్రజల్లో ఉంది. ఈ సమయంలో కేసీఆర్ పార్టీ విస్తరణ సాధ్యమయ్యే పని కాదని రాజకీయ విశ్లేషకులు తేల్చేస్తున్నారు.అయితే కేసీఆర్ తో పాటు తెలంగాణ మంత్రులు ఏపీ సర్కారుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అంటే వైసీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే నాయకులను ఆకట్టుకోవడానికే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నన్నారని తెలుస్తోంది. అందుకే వైసీపీ నేతలు సైతం వివాదం ముదిరిపోకుండా సంయమనం పాటిస్తున్నారు. ఏపీ ప్రజలు అసలు కేసీఆర్ జాతీయ పార్టీ గురించి పట్టించుకోవడం లేదు కాబట్టి ..టీఆర్ఎస్ వాళ్లు ఎన్నిరకాల విమర్శలు చేసినా పట్టించుకోవద్దని వైసీపీ శ్రేణులకు అధిష్టానం అల్టిమేటం ఇచ్చినట్టు తెలిసింది.
Also Read: Uttar Pradesh Husband And Wife: భర్త జీతం తెలుసుకునేందుకు ఈ మహిళ ఏం చేసిందో తెలుసా?
అయితే ప్రజలు యాక్సెప్ట్ చేయని పార్టీలోకి ఏపీ నేతలు ఎందుకు మొగ్గుచూపుతున్నారన్నది మిలియన్ డాలర్న ప్రశ్న. అయితే పూర్వాశ్రమంలో తనతో పనిచేసిన టీడీపీ నేతలు, వెలమ సామాజికవర్గం వారిని కొత్త పార్టీలో చేర్చాలని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే తనతో టీడీపీలో కలిసి పనిచేసిన నాయకులు కనుమరుగుయ్యారు. వారి వారసులుమాత్రం ఉన్నారు. ప్రస్తుతానికి ఉత్తరాంధ్రలో వెలమ సామాజికవర్గానికి చెందిన ధర్మాన ప్రసాదరావు, ధర్మాన క్రిష్ణదాస్, కింజరాపు ఎర్రన్నాయుడు,గుండ అప్పలసూర్యనారాయణ, బొబ్బిలి రాజులు ఆర్వీఎస్కే రంగారావు, శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, కోళ్ల లలితకుమారి, ద్వారపురెడ్డి జగదీష్, చింతకాయల అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి తదితర వెలమ సామాజికవర్గానికి చెందిన నాయకులు ఉన్నారు. వీరంతా వైసీపీ, టీడీపీలో కొనసాగుతున్నారు. ఆయా పార్టీల్లో వీరికి సముచిత స్థానం దక్కుతూ వస్తోంది. వీరు కేసీఆర్ కొత్త పార్టీ వైపు చూసే అవకాశమైతే లేదు.

అయితే రాజకీయంగా ఫేడ్ అవుట్ అయినా వెలమ సామాజికవర్గ కుటుంబాలున్నాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి బగ్గు లక్ష్మణరావు, విజయనగరం నుంచి మరిశర్ల తులసి, విశాఖ నుంచి తంగేడు రాజులు కేసీఆర్ పార్టీ వైపు మొగ్గుచూపే అవకాశముంది. పైగా భారతీయ రాష్ట్ర సమితిగా పేరు మార్చడంతో ఇబ్బందులుండవని నేతలు భావిస్తున్నారు. ఆ పై టీఆర్ఎస్ తెలంగాణలో అధికారమున్న ధనిక పార్టీ. నిధులు భారీగా సమీకరించే అవకాశముంది. ఈ లెక్కలు వేసుకొని కొందరు మొగ్గుచూపే అవకాశముంది. హైదరాబాద్ లో ఇతరత్రా అవసరాల కోసం మరికొందరు నాయకులు బీఆర్ఎస్ లో చేరే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.
[…] Also Read: KCR- AP TDP Leaders: ఏపీ టీడీపీ నేతలపై కేసీఆర్ ఫోక… […]
[…] Also Read: KCR- AP TDP Leaders: ఏపీ టీడీపీ నేతలపై కేసీఆర్ ఫోక… […]