Homeఆంధ్రప్రదేశ్‌Janasena leaders attack Varma: పిఠాపురం లో వర్మ పై దాడి కి దిగిన జనసేన...

Janasena leaders attack Varma: పిఠాపురం లో వర్మ పై దాడి కి దిగిన జనసేన నేతలు.. సంచలనం రేపుతున్న వీడియో..

Janasena leaders attack Varma: పిఠాపురం లో టీడీపీ , జనసేన పార్టీ నాయకుల మధ్య నేడు మరోసారి భగ్గుమనే రేంజ్ లో గొడవలు చెలరేగాయి. పాడా మీటింగ్ కి హాజరు అయ్యేందుకు ఇరు పార్టీ నాయకులకు సంబంధించిన ముఖ్య నేతలు , కార్యకర్తలు హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కొన్ని ఫ్లెక్సీలలో కేవలం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఫోటోలు మాత్రమే ఉండడం , సీఎం చంద్రబాబు ఫోటోలు లేకపోవడం తో , ఇదేంటి అని అధికారులను వర్మ మరియు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు ప్రశ్నించారు. అక్కడి నుండి మొదలైన గొడవ తారా స్థాయికి చేరుకుంది. గతం లో వైసీపీ పార్టీ నుండి పిఠాపురం నియోజగవర్గం ఎమ్మెల్యే గా పని చేసిన పెందెం దొరబాబు , ఇప్పుడు జనసేన పార్టీ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పెందెం దొరబాబు కి వర్మ కి మధ్య లో పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ గొడవలు ఎప్పటి నుండో ఉన్నాయి.

ఇక నేడు వీళ్లిద్దరు ఈ గొడవలో ఒకరిని ఒకరు తారాస పడడంతో మాటకు మాట పెరిగింది. పెండెం దొరబాబు అయితే నేరుగా వర్మ ని కొట్టేందుకు ముందుకు దూసుకొని వెళ్ళిపోయాడు. దీంతో అక్కడ ఇరు వర్గాల మధ్య తీవ్రమైన ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పెందెం దొరబాబు పై వర్మ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యాడు. ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే గా ఉన్నంత కాలం మట్టిని దోచుకున్నాడని, చెరువులను తవ్వేశాడని, అతని పై 150 కోట్ల రూపాయిల అవినీతి ఆరోపణలు ఉన్నాయని , కూటమి అధికారం లో ఉంది కాబట్టి , ఎక్కడ తన అవినీతిని బయటకు తీసుకొస్తారని భయం తోనే ఆయన జనసేన పార్టీలో దూరాడు అంటూ మండిపడ్డాడు. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవడం కోసం మేము ఎంతో కష్టపడి పని చేశాము , కానీ ఈ పెందెం దొరబాబు పవన్ కళ్యాణ్ ని ఓడించడం కోసం కోట్లు ఖర్చుపెట్టాడు , అందుకు నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు .

ప్రైవేట్ కార్యక్రమాల్లో వాళ్ళు ఎవరి ఫోటోలు పెట్టుకున్నా అభ్యంతరం లేదని , కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం గారి ఫోటోలు లేకపోతే ఎలా ?, అధికారులను ప్రశ్నిస్తే తప్పు అయిపోయింది క్షమించండి అంటూ ఆ ఫ్లెక్సీని తొలగించారు , నిజంగా తప్పు జరగకపోతే అతను క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఏంటని వర్మ నిలదీశాడు. ఇది మొదటిసారి జరగడం కాదని , పది సార్లు జరిగిందని , అసలు పిఠాపురం నియోజగవర్గం లో సీఎం గారి ఫోటో పడడం లేదని , ఆయన ఫోటో పడకపోతే చంద్రబాబు నాయుడు గారైన ఊరుకుంటాడేమో కానీ , మేము అసలు ఊరుకోమని , ఎందుకంటే ఆయన మా నాయకుడని , 22 ఏళ్ళ నుండి కలిసి పని చేస్తున్నాము అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన ఏమి మాట్లాడాడో ఈ క్రింది వీడియో లో చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version