Pawan Kalyan Varahi Yatra : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘వారాహి యాత్ర’ మొదటి విడత పర్యటన నేడు ప్రారంభమైంది. తెల్లవారు జామున అన్నవరం కి చేరుకున్న పవన్ కళ్యాణ్ , సాయంత్రం కాకినాడ ప్రాంతం లోని కత్తిపూడి సభ కి చేరుకున్నాడు. పవన్ కళ్యాణ్ ప్రసంగం వినేందుకు అభిమానులు భారీ ఎత్తున తరళివచ్చారు. ఈ క్రమం లో కొంతమంది అభిమానులు నిలబడడానికి కూడా స్థలం లేక లైటింగ్ మీద నిల్చున్నారు.
ఒక అభిమాని లైటింగ్ మీద నుండి అదుపు తప్పి కరెంటు ట్రాన్స్ ఫార్మర్ మీద పడిపోవడం తో ఆ కుర్రాడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ దుర్ఘటన పవన్ కళ్యాణ్ సభా స్థలి చేరుకోకముందు జరిగింది. ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసులు సభా స్థలికి చేరుకొని ఆ కుర్రాడికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. వారాహి యాత్ర ప్రారంభమైన రోజే ఇలాంటి అపశృతి చోటు చేసుకోవడం జనసేన పార్టీ శ్రేణులను తీవ్రమైన దిగ్బ్రాంతికి గురి చేసింది.
అప్పటికీ జనసేన పార్టీ నాయకులూ అక్కడికి వచ్చిన అభిమానులను వారిస్తూనే ఉన్నారు, పక్కనే ట్రాన్స్ ఫార్మ్ ఉంది వెంటనే దిగండి అని, కానీ అభిమానులు అత్యుత్సాహం తో లైటింగ్ పోల్ ఎక్కేసారు. ఇప్పుడు సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన ఈ దుర్ఘటన గురించే మాట్లాడుకుంటున్నారు. అభిమానం ఉండడం మంచిదే, కానీ ఇలా మితిమీరిన అభిమానం కన్నా తల్లితండ్రులకు శోకం మిగులుస్తుంది. పవన్ కళ్యాణ్ జనాల్లోకి తరచూ వస్తూనే ఉంటాడు.
ఆయనని చూసే అవకాశాలు ముందు ముందు వస్తూనే ఉంటాయి. కాబట్టి అత్యుత్సాహం ఆపి, మంచి కార్యక్రమం కోసం తలపెట్టిన ‘వారాహి యాత్ర’ కి విఘాతం కలిగించకండి, మీలో ఒక్కరి ప్రాణం కి హాని జరిగిన పవన్ కళ్యాణ్ గారు సరిగా అన్నం కూడా తినలేరు. మీకోసమే ఆయన బయటకి వచ్చి పోరాడుతున్నాడు, మీరే ఇలా అయిపోతే ఎలా అని జనసేన పార్టీ నాయకులూ సోషల్ మీడియా ద్వారా అభిమానులను విన్నవించుకుంటున్నారు.