Site icon OkTelugu

Y S Jagan Mohan Reddy: అదిరేటి డ్రస్సు నేనేస్తే.. జగన్ ట్రెండీ లుక్

Y S Jagan Mohan Reddy

Y S Jagan Mohan Reddy

Y S Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy ) ఒక్కోసారి ట్రెండీ లుక్ తో అభిమానులకు అలరిస్తుంటారు. తాజాగా ఆయన అదే ట్రెండీ లుక్ తో కనిపించేసరికి అభిమానులు ఫిదా అవుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ పర్యటనకు బయలుదేరారు జగన్మోహన్ రెడ్డి. సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇవ్వడంతో శనివారం అర్ధరాత్రి బెంగళూరు విమానాశ్రయం నుంచి ఆయన ప్రయాణం అయ్యారు. కానీ ఎప్పుడూ సాధారణ దుస్తుల్లో కనిపించే ఆయన.. ఒక ట్రెండీ లుక్ తో కనిపించడం విశేషం. దాదాపు ఆయన మూడు వారాలపాటు విదేశీ పర్యటనలోనే ఉంటారు. ప్రతి సంవత్సరం సమ్మర్ లో విదేశీ ట్రిప్ నకు వెళ్లడం అలవాటు చేసుకున్నారు. ఎప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉండే ఆయన ప్రతి సంవత్సరం విదేశీ పర్యటనకు వెళ్తుంటారు. మే 15 వరకు ఆయన విదేశీ పర్యటన కొనసాగనుంది. ఆ తరువాత తాడేపల్లి కి చేరుకొని దైనందిన రాజకీయ కార్యక్రమాల్లో నిమగ్నం కానున్నారు.

* సాదాసీదాగా ఉండే..
సాధారణంగా జగన్మోహన్ రెడ్డి వైట్ షర్ట్ తో ( white shirt ) పాటు గోధుమ లేదా ఖాకి రంగు ప్యాంట్, సాధారణ చెప్పులతో చాలా సింపుల్ గా కనిపిస్తారు. కానీ ఇప్పుడు విదేశీ పర్యటన పుణ్యమా అని జగన్మోహన్ రెడ్డి డ్రెస్సింగ్ స్టైల్ మార్చారు. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. విమానం ఎక్కక ముందు బెంగళూరు ఎయిర్పోర్టులో ఆయన జీన్ షర్ట్, జీన్ ప్యాంట్, షూస్, ఖరీదైన వాచి ధరించి కనిపించారు. జగన్మోహన్ రెడ్డిని చూసిన వారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆయనతో ఫోటోలు దిగేందుకు, వీడియోలు తీసేందుకు పోటీపడ్డారు. ప్రస్తుతం ఈ ఫోటోలతో పాటు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

* గతంలో చాలా సార్లు..
ఇటువంటి ట్రెండీ లుక్ తో ( trendy look ) కనిపించడం జగన్మోహన్ రెడ్డి ఇదే తొలిసారి కాదు. గతంలో విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు ఇలాంటి కొత్త లుక్ లో కనిపించేవారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి సైతం సాధారణ పంచ కట్టుతో కనిపించేవారు. కానీ విదేశీ పర్యటనకు వెళ్లే సమయంలో సూట్, షూ ధరించి స్టైలిష్ గా కనిపించేవారు. జగన్ ఇప్పుడు తన తండ్రి బాటనే అనుసరిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు.

Exit mobile version