https://oktelugu.com/

Big Shock For Jagan : జగన్‌కు బిగ్‌ షాక్‌ : సాక్షి పత్రికలో అవాస్తవాలపై స్పీకర్‌ సీరియస్‌.. ప్రివిలేజ్‌ నోటీసుల జారీకి నిర్ణయం!

Jagan : ఆంధ్రప్రదేశ్‌లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. భారీ మెజారిటీతో కూటమికి పట్టం కట్టారు అక్కడి ప్రజలు

Written By: , Updated On : February 26, 2025 / 08:40 AM IST
Jagan

Jagan

Follow us on

Big Shock For Jagan : ఆంధ్రప్రదేశ్‌లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. భారీ మెజారిటీతో కూటమికి పట్టం కట్టారు అక్కడి ప్రజలు. అంతకుముందు 151 సీట్లతో అధికారంలో ఉన్న వైసీపీని కేవలం 11 స్థానాలకు పరిమితం చేశారు. కూటమి గెలిచిన వెంటనే వైసీపీ నేతలు, పార్టీ కార్యాలయాలు, ఇళ్లపై దాడులు మొదలు పెట్టారు టీడీపీ(TDP)నేతలు. అక్రమంగా కేసులు పెట్టడం, పాత కేసులను తిరిగి తోడడంతోపాటు పార్టీ నేతలను అరెస్టు చేసి జైలుకు కూడా పంపుతోంది కూటమి ప్రభుత్వం. దీంతో ఏపీలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ అధినేత జగన్‌తోపాటు ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ వైఫల్యాలను జగన్‌ తన సొంత పత్రిక ‘సాక్షి’లో ప్రచురిస్తున్నాడు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నాడు. దీంతో మీడియాను కూడా కొన్ని కార్యక్రమాలకు రానివ్వడం లేదు. తాజాగా అసెంబ్లీ సమావేశాల కవరేజీకి అనుమతించలేదు. మరోవైపు సాక్షి పత్రిక అసెంబ్లీ వ్యవహారాలపై తప్పుడు సమాచారాన్ని ప్రచురిస్తూ సభ గౌరవాన్ని దెబ్బతీస్తోందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా ఈ విషయాన్ని స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల ఎమ్మెల్యేల శిక్షణ శిబిరాలు నిర్వహించకపోయినా కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడిపై ఇటీవల కథనం చల్లిందని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

స్పీకర్‌ ఆగ్రహం..
సాక్షి మీడియాలో అసెంబ్లీ కార్యకలాపాలపై తప్పుడు కథనాలు రాయడం, ప్రసారం చేయడంపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని ఉపేక్షించొద్దని పేర్కొన్నారు. ఈమేరకు సాక్షి పత్రికకు త్వరలోనే ప్రివిలేజ్‌ నోటీసులు పంపాలని నిర్ణయించారు. సహా హక్కుల కమిటీ నిర్ణయం మేరకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

జగన్‌ తీరుపైనా అభ్యంతరం..
ఇదిలా ఉంటే.. గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా జగన్‌తోపాటు వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరును స్పీకర్‌ తప్పు పట్టారు. పేపరుల చించి వాకౌట్‌ చేయడాన్ని ఖండించారు. ఈ విషయం మాత్రం రాయకుండా లేనిపోనివన్నీ సాక్షిలో రాశారని పేర్కొన్నారు. సాక్షి కథనాలు బాధించాయని తెలిపారు. ఫేక్‌ న్యూస్‌ను ఉపేక్షించేది లేదని కూటమి సభ్యులు కోరారు. మరోవైపు సభలో జరిగిన పరిణామాలు, జగన్‌ వ్యవహరించిన తీరుపై స్పీకర్‌ అభ్యంతరం తెలిపారు. సభలో వైసీపీ వ్యవహరించిన తీరును ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు.