Homeఆంధ్రప్రదేశ్‌Jagan : జగన్ పాదయాత్ర.. 2.0 విశ్వరూపం తప్పదా?

Jagan : జగన్ పాదయాత్ర.. 2.0 విశ్వరూపం తప్పదా?

Jagan : వైఎస్సార్ కాంగ్రెస్( YSR Congress ) అధినేత జగన్మోహన్ రెడ్డి మరోసారి పాదయాత్ర చేస్తారా? పాదయాత్రతో ప్రజల మధ్యకు వెళ్తారా? రెండోసారి ఆయన పాదయాత్ర చేస్తే ప్రజలు ఆదరిస్తారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ. త్వరలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయబోతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రకటించారు. విశాఖలో జరిగిన పార్టీ శ్రేణుల సమావేశంలో గుడివాడ అమర్నాథ్ ఈ ప్రకటన చేశారు. అయితే ఆయన యధాలాపంగా ఈ ప్రకటన చేశారా? లేకుంటే నిజం తెలిసి మాట్లాడరా? అన్నది తెలియాల్సి ఉంది. నేతల పాదయాత్రతో ఆ పార్టీలు అధికారంలోకి వస్తున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సైతం ఆ ఫార్ములాను ఎంచుకున్నారా అన్న అనుమానం కలుగుతోంది.

Also Read : జగన్ ‘వర్క్ ఫ్రం బెంగళూరు’.. టైటిల్ అదుర్స్!

* పాదయాత్రతో విజయం..
2003లో ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాదయాత్ర చేశారు వైయస్ రాజశేఖర్ రెడ్డి( YS Rajasekhara Reddy ). దశాబ్ద కాలం పాటు అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీని విజయ బాట పట్టించారు. కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి రావడానికి కారణమయ్యారు. 2014 ఎన్నికలకు ముందు సుదీర్ఘ పాదయాత్ర చేశారు టిడిపి అధినేత చంద్రబాబు. ఆ ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చేందుకు కారణమయ్యారు. 2018లో పాదయాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి. 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయానికి కారణమయ్యారు. 2023లో పాదయాత్ర చేశారు నారా లోకేష్. దీంతో 2024 టిడిపి అధికారంలోకి వచ్చేందుకు కారణమయ్యారు. అందుకే ఈ పాదయాత్ర ఫార్ములాను అనుసరించి 2029 ఎన్నికల్లో గెలవాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది.

* క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. 2024 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. పార్టీ నుంచి నేతలు బయటకు వెళ్లిపోయారు. చివరకు పార్టీలో నెంబర్ 2 గా ఉన్న విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) లాంటి నేతలు సైతం తమ దారి తాము చూసుకున్నారు. పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. మరోవైపు కూటమి ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేస్తోంది. ఈ క్రమంలో పార్టీని బలోపేతం చేయడం కంటే పార్టీని కాపాడుకోవడం జగన్మోహన్ రెడ్డి ముందున్న కర్తవ్యం. అందుకే ఆయన తప్పకుండా పాదయాత్ర చేస్తారని పార్టీ శ్రేణుల నమ్మకం. అందులో భాగంగానే గుడివాడ అమర్నాథ్ ప్రకటన చేసి ఉంటారన్నది ఒక అనుమానం.

Also Read : అమరావతి విషయంలో చంద్రబాబును భయపెడుతున్న ఆంధ్రజ్యోతి ఆర్కే!

* బెంగళూరు కే ఎక్కువ పరిమితం..
అయితే రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది మొదలు జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా బెంగళూరుకి పరిమితం అవుతున్నారు. కనీసం ప్రజల మధ్యకు వచ్చేందుకు ఇష్టపడడం లేదు. మొన్న మధ్యాహ్నం పార్టీ శ్రేణుల పరామర్శకు వచ్చారు. జైల్లో ఉన్న నేతలను పరామర్శించారు. గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. అక్కడ రైతులతో మాట్లాడారు. అంతకుమించి ఆయన ప్రజల మధ్యకు వచ్చింది లేదు. జిల్లాల పర్యటనకు వెళ్తానని ఆరు నెలల కిందట ప్రకటించారు. కానీ అది ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. అందుకే పాదయాత్ర పై అనుమానాలు ఉన్నాయి. పైగా ఇదివరకు చేసి ఉండడంతో.. ఆ స్థాయిలో ప్రజల నుంచి ఆదరణ వచ్చే అవకాశం లేదు. పైగా కూటమి ప్రభుత్వం నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే పాదయాత్ర బదులు బస్సుయాత్ర , జిల్లాల పర్యటనకు ఎక్కువగా ఆయన మొగ్గు చూపే అవకాశం ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Oktelugu Epaper
Exit mobile version