YS Jagan New Look : ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు. కానీ ఆయనకు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో న్యూ లుక్ తో కనిపించారు జగన్మోహన్ రెడ్డి. సాధారణంగా జగన్ ఎక్కువగా తెల్లచొక్కా తోనే కనిపిస్తూ ఉంటారు. అయితే తాజా విదేశీ పర్యటనలో మాత్రం జీన్స్ ప్యాంట్, బ్లూ షర్ట్, షూస్ వేసుకొని న్యూ లుక్ తో కనిపించారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. మిస్టర్ కూల్ అంటూ.. సూపర్ అంటూ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు షేర్ చేస్తున్నారు.
* కోర్టు అనుమతితో..
దాదాపు మూడు వారాల పర్యటన నిమిత్తం ఆయన విదేశాలకు వెళ్లారు. సిబిఐ కోర్టు( CBI Court) అనుమతి కూడా తీసుకున్నారు. అయితే చిరునామాకు సంబంధించి ఈమెయిల్ ఐడి, సొంత ఫోన్ నెంబర్ సిబిఐకి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఫోన్ నెంబర్ ఇవ్వక పోవడాన్ని సిబిఐ మరోసారి కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో కోర్టు జగన్ న్యాయవాదికి నోటీసులు ఇచ్చింది. దీంతో ఆ వివాదం సమసిపోయింది. పూర్తిగా వ్యక్తిగత పర్యటన నిమిత్తం జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లారు. కానీ ఆయన న్యూ లుక్ తో ఉన్న ఫోటోలు మాత్రం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తున్నాయి.
* డ్రెస్ కోడ్ ఎప్పుడు ఒకేలా..
సాధారణంగా జగన్ అధికారంలో ఉన్నా.. లేకపోయినా డ్రెస్ కోడ్( dress code) మాత్రం సాధారణంగానే ఉంటుంది. తెల్ల రంగులో ఉన్న షర్ట్ ను ధరిస్తారు. ఎక్కువగా కాకి కలర్ ప్యాంటును ధరిస్తుంటారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు సిద్ధం సభలను కార్పొరేట్ స్థాయిలో ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో నడిచి వెళ్తూ.. పార్టీ శ్రేణులను అభివాదం చేస్తూ ముందుకు సాగేవారు. ఆ సమయంలో సైతం సాధారణ డ్రెస్ కోడ్ తోనే ఉండేవారు. అయితే ఇప్పుడు విదేశీ పర్యటనలు జీన్స్ ప్యాంట్, బ్లూ షర్ట్, షూస్ వేసుకొని న్యూ లుక్ తో కనిపించడంతో.. అదిరిందయ్యా జగన్ అంటూ ఎక్కువమంది అభినందిస్తున్నారు.