Jagan Mohan Reddy court case: సాధారణంగా రాజకీయ పార్టీలకు, నేతలకు కోర్టు కేసులు తప్పవు. అరెస్టులు కూడా జరుగుతుంటాయి. కానీ ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ నేతలకు ఎదురైన కేసులు, కోర్టు మొట్టికాయలు ఏ ఇతర పార్టీ నేతలకు ఎదురవలేదు. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి నిన్నటి కారుమూరి వెంకట్ రెడ్డి వరకు ఆ పార్టీ నేతలు కేసులను ఎదుర్కొనే ఉన్నారు. ప్రతిపక్షంలో కాదు అధికారపక్షంలో ఉన్నప్పుడు కూడా వారికి కేసులు తప్పలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు కామన్. కానీ అధికారపక్షంలో ఉన్నప్పుడు కేసులు ఎదురైతే అది ముమ్మాటికి తప్పిదాలే. అధికారపక్షంలో ఉండి కూడా వారు కేసులను తప్పించుకోలేదు. ప్రభుత్వం తరఫున అధికారులు కోర్టుకు హాజరైన సందర్భాలు కూడా ఉన్నాయి.
Also Read: ఒకరు కదలరు.. మరొకరు వెళ్ళరు.. వైసీపీలో ఆ మాజీ మంత్రులకు కష్టమే!
అధినేతను చూసి..
జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) కేసులను ఎదుర్కోవడం వల్లే ఆయనపై అంతటి సానుభూతి లభించింది. బహుశా ఈ కారణం తోనే ఆ పార్టీ నేతలు కూడా తాము కేసులను ఎదుర్కోవాలని చూస్తుంటారు. అరెస్టులు కావాలని భావిస్తుంటారు. అయితే ఆ అలవాటు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మారింది. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడం, రాజ్యాంగానికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడం, న్యాయవ్యవస్థ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం.. ఇలా చాలా అంశాల్లో కోర్టులో నిలబడిన సందర్భాలు ఉన్నాయి. కోర్టులు తప్పు పట్టడమే కాకుండా చివాట్లు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ వాటిని గుణపాఠాలుగా చూడలేదు. అలవాటైన విద్యగా మార్చుకున్నారు.
Also Read: మళ్లీ వారం వారం కోర్టుకు జగన్?!
ఓ 100 మంది నేతల వరకు..
వైసిపి ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత చెప్పనవసరం లేదు. పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి( Mithun Reddy), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వై వి సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఆర్కే రోజా, అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు, సిదిరి అప్పలరాజు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఓ 100 మంది వరకు కోర్టు మెట్లు ఎక్కిన వారే. తాము తప్పు చేయలేదని.. తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని.. ఇలా ఎన్నెన్నో కారణాలతో న్యాయస్థానాలను ఆశ్రయించిన వారే. అంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికారం, ప్రతిపక్షం అన్న తేడా లేదు. ఎక్కడ ఉన్నా.. కోర్టులు, జైలు తప్పనిసరి అన్నమాట.