Homeఆంధ్రప్రదేశ్‌Group 1 Evaluation: వైసీపీ ప్రభుత్వ వైఫల్యం... ప్రమాదంలో 326 మంది గ్రూప్‌–1 ఉద్యోగుల భవితవ్యం!

Group 1 Evaluation: వైసీపీ ప్రభుత్వ వైఫల్యం… ప్రమాదంలో 326 మంది గ్రూప్‌–1 ఉద్యోగుల భవితవ్యం!

Group 1 Evaluation: ప్రభుత్వాలు ప్రజలకు రక్షణ కల్పించాలి. ఉద్యోగాలు, ఉపాధి చూపించాలి. కానీ కొన్నిసార్లు ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ప్రజలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు ముప్పుగా మారుతాయి. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగా ఇప్పుడు గ్రూప్‌–1 ఉద్యోగులుగా ఎంపికైన 326 మంది ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఎంపిక కానివారు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఏపీపీఎస్సీ 2018 గ్రూప్‌–1 మెయిన్స్‌ జవాబు పత్రాల మూల్యాంకనంపై తీవ్ర అనుమానం వ్యక్తం చేసింది. అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ స్థాయి అధికారి నేతృత్వంలో ఫోరెన్సిక్‌ నిపుణులతో సిట్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఎంపికైన 326 మంది ఫోకల్‌ పోస్టుల నుంచి తప్పించి నాన్‌–ఫోకల్‌ పోస్టులకు బదిలీలు చేయాలని సూచించింది.

అసలు ఏం జరిగింది..
2018 డిసెంబర్‌ నోటిఫికేషన్, మే 2019 ప్రిలిమ్స్, 2020 మెయిన్స్‌తో ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఎసీపీఎస్సీ డిజిటల్‌ ఎవాల్యుయేషన్‌పై అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు. దీంతో కోర్టు మాన్యువల్‌ ఎవాల్యుయేషన్‌ చేయాలని ఆదేశించింది. దీంతో 2021–22లో అప్పటి ఏపీపీఎస్సీ సెక్రెటరీ సీతారామాంజనేయులు బయటి సంస్థలతో మాన్యువల్‌ ఎవాల్యుయేషన్‌చేయించారు. అయితే బయట ఎవాల్యుయేషన్‌ చెల్లదని ఏపీపీఎస్సీ సభ్యులు తెలుపడంతో మళ్లీ ఏపీపీఎస్సీలో మూల్యాంకనం చేయించారు. అంటే మొత్తంగా మూడుసార్లు మూల్యాంకనం జరిగింది.

ఎవాల్యుయేషన్‌ లోపాలు..
కోర్టు 2024 మార్చిలో 2022 ఎంపికను రద్దు చేసింది. హైదరాబాద్‌ ఎవాల్యుయేషన్‌ ఆధారాలు లేకపోవడం తేలడంతో మరో సిట్‌ ఏర్పాటు. ఇప్పుడు జవాబు పత్రాలు, ఓఎంఆర్‌ షీట్ల ట్యాంపరింగ్‌ పై వచిరాణ జరపాలని ఆదేశించింది. ఎంపికైన అభ్యర్థుల ఆన్సర్‌ సీట్స్‌తోపాటు, కింద ఉన్న వంద మంది పత్రాలు ప్రత్యేకంగా పరిశీలించాలని ఆదేశించింది. అక్రమాలు నిర్ధారణ అయితే 326 నియామకాలు రద్దు అవుతాయి. ఇది రాష్ట్ర పరిపాలనపై ప్రభావం చూపిస్తుంది.

ఈ వివాదానికి కారణం అప్పటి వైసీపీ ప్రభుత్వమే. మూల్యాంకనం సక్రమంగా చేయని కారణంగా ఇప్పుడు ఎంపికైన 326 మందితోపాటు ఎంపికకాని అభ్యర్థులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎంపికైనవారిలో టెన్షన్‌ నెలకొంది. ఉద్యోగాలు ఉంటాయో ఊడతతాయో తెలియని పరిస్థితి. దీంతో వారిలో ఒత్తిడి నెలకొంది. సిట్‌ నివేదిక త్వరలో రావాలని అభ్యర్థులు ఆశిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Jogi Ramesh: జోగి రమేష్ మతమార్పిడి.. దుర్గమ్మ వద్ద ప్రమాణం!

Jogi Ramesh: వైసీపీలో పదవి కావాలంటే మతం మారాలా? క్రిస్టియన్ మతం తీసుకోవాల్సిందేనా? వైసీపీలో ఉన్న నేతల్లో ఎక్కువమంది అలానే చేసారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తోంది. తాజాగా మాజీ...

YS Jagan Mohan Reddy: జగన్ జైలు పరామర్శలు.. వైసీపీలో కొత్త చర్చ!

YS Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డి మొండివాడు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు స్వయంగా చెబుతారు. అయితే ఆయన మొండితనం ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చు. కానీ అదే...

Bonda Uma Maheswara Rao: బోండా ఉమా పై వైసీపీ స్కెచ్!

Bonda Uma Maheswara Rao: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టిడిపిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దీనిపై టిడిపి హై కమాండ్ ఆగ్రహంగా...

Loan Advice: అప్పు ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఏం జరుగుతుంది?

Loan Advice: డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరం ఉంటుంది. అయితే కొందరి వద్ద తక్కువగా.. మరికొందరి వద్ద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డబ్బు ఉన్న వారి వద్ద లేనివారు అప్పుగా...

AP Ration Cards: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

AP Ration Cards: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరింత నాణ్యమైన బియ్యం అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు స్టీమ్డ్ రైస్ అందించనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ...
Oktelugu Epaper
Exit mobile version