CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు ( CM Chandrababu) భద్రతలో భారీ మార్పులు చేశారు. ఆయన భద్రతా బృందంలోకి మరో టీం వచ్చి చేరింది. ఇప్పటికే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్( national security guards ), స్థానిక సాయుధ బలగాలు ఆయనకు భద్రత కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదనపు భద్రత కల్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబుకు ముప్పు పొంచి ఉందని హెచ్చరికల నేపథ్యంలో స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్( special security group) ఇటీవల మార్పులు చేసింది. ప్రస్తుతం చంద్రబాబుకు భద్రత కల్పిస్తున్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ బ్లాక్ కాట్ కమాండోలు, ఎస్ఎస్జి సిబ్బందికి… ఇప్పుడు కౌంటర్ యా క్షన్ టీం( counter action team ) రక్షణగా ఉండబోతోంది. ఈ మేరకు ఆరుగురు కౌంటర్ యాక్షన్ కమాండోలు విధుల్లో ఉంటున్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా సీఎం చంద్రబాబుకు సంబంధించి భద్రతాపరమైన మార్పులు చేశారు. మూడంచెల భద్రత ఉంటుంది చంద్రబాబుకి. ఎన్.ఎస్.జి తొలి, ఎస్ ఎస్ జి రెండు వలయాల్లో సెక్యూరిటీని కల్పిస్తాయి. మూడోవ వలయంగా సీఎం పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడి పోలీస్ యూనిట్లు, సాయుధ బలగాలు భద్రతను ఇస్తాయి. వీరితో పాటుగా ఇప్పుడు కొత్తగా ఆరుగురు కౌంటర్ యాక్షన్ కమాండోలు విధుల్లోకి రావడం విశేషం.
* నక్సలైట్ల దాడితో
2003లో సీఎం గా ఉన్న చంద్రబాబుపై అలిపిరి వద్ద నక్సలైట్లు దాడి చేశారు. క్లైమరామెన్స్( climaramens) పెట్టి ఆయన కారును పేల్చివేశారు. ఆ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు చంద్రబాబు. అప్పటినుంచి నేషనల్ సెక్యూరిటీ గాడ్స్ నుంచి ఆయనకు భద్రత కల్పిస్తూ వస్తున్నారు. అప్పటినుంచి ఆయన ముఖ్యమంత్రితో పాటు ప్రతిపక్ష నేత హోదాలో కొనసాగుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు భద్రత కొనసాగుతోంది. తాజాగా మరోసారి ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో.. భద్రత విషయంలో అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కేంద్ర భద్రతా సంస్థల( Central security forces) సైతం ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటున్నాయి.
* రక్షణ కోసమే
కౌంటర్ యాక్షన్ టీం.. సీఎం చంద్రబాబుతో పాటు భద్రతా సిబ్బందికి రక్షణగా ఉంటారు. ఏదైనా ఇబ్బంది ఎదురైతే ఎన్ ఎస్ జి, ఎస్ ఎస్ జి ముఖ్యమంత్రిని రక్షించి సురక్షితంగా ఉండే ప్రాంతానికి తీసుకెళ్తారు. ఈలోపు కౌంటర్ యాక్షన్( counter action) టీం బయట నుంచి దాడి చేసే వారిని ఎదుర్కొంటుంది. ప్రధానమంత్రి భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్( Special Protection Group) ఈ కౌంటర్ యాక్షన్ కమాండోలకు శిక్షణను ఇచ్చాయి. ఈ టీంలో కమాండోలు ప్రత్యేకంగా నలుపు రంగు చొక్కా, గోధుమ రంగు ప్యాంటు డ్రెస్ కోడ్ ఉంటుంది వీరికి. షర్ట్ పై ఎస్ఎస్జి అని రాసి ఉంటుంది.
* విపక్ష నేతగా పెరిగిన భద్రత
2019 నుంచి 2024 వరకు చంద్రబాబు( Chandrababu) విపక్షనేతగా ఉండేవారు. సొంత నియోజకవర్గ కుప్పం తో పాటు పుంగనూరులో ఆయనపై దాడికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. దీంతో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ భద్రత ఆయనకు పెంచారు. ముందు ఆరుగురు కమాండోలు సెక్యూరిటీ వింగ్లో ఉండగా.. ఆ తరువాత చంద్రబాబు బయటకు వెళ్లే సమయంలో ఆ సంఖ్యను 12 కు పెంచారు. ఎన్నికల్లో సీఎం అయ్యే సరికి ఆయన భద్రత అమాంతం పెరిగింది. ఇప్పుడు తాజాగా కౌంటర్ యాక్షన్ టీం కూడా రంగంలోకి దిగింది. అయితే ప్రజల్లోకి వెళ్లే క్రమంలో ఇబ్బంది పెట్టకుండా తన భద్రత చూసుకోవాలని చంద్రబాబు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ విభాగానికి ప్రత్యేక విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Increased security for cm chandrababu into the field of special team what happened
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com