Greater Visakha : సాధారణంగా విదేశాలకు వెళ్లి విడిది చేయాలని చాలామందికి ఉంటుంది. కానీ అది ఖరీదైన అంశం. చేతిలో లక్షలు లేనిదే విదేశీ ప్రయాణం జరపలేం. అయితే ఎటువంటి ఖర్చు లేకుండా ఇప్పుడు విదేశాలకు వెళ్లిపోయారు విశాఖ కార్పొరేషన్ కు చెందిన కార్పొరేటర్లు. మేయర్ గొలగాని వెంకట హరి కుమారి పై( mayor golagani Venkata Hari Kumari ) అవిశ్వాస తీర్మానం పెట్టిన నేపథ్యంలో పాలకపక్షం తో పాటు ప్రతిపక్షం సభ్యులను విదేశాలకు తరలించడం హాట్ టాపిక్ అయ్యింది. గతంలో ఎమ్మెల్యేలను పక్క రాష్ట్రాలకు తరలించడం చూశాం. కానీ ఇప్పుడు ఏకంగా విదేశాలకు కార్పొరేటర్లను తరలించడం మాత్రం నిజంగా విశేషమే. అనుకొని అవకాశం రావడంతో కార్పొరేటర్లు విదేశాల్లో సేద తీరుతున్నారు.
Also Read : జగన్ ను ప్రశ్నించిన ఎస్ఐ ఫొటోలు.. వైరల్
* రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేషన్..
గ్రేటర్ విశాఖ( greater Visakha).. నవ్యాంధ్రప్రదేశ్లో అతిపెద్ద నగరపాలక సంస్థ. దాదాపు పది నియోజకవర్గాల పరిధిలో ఉంటుంది గ్రేటర్ విశాఖ. విశాఖ నగరంలోని నాలుగు నియోజకవర్గాలు, భీమిలి, పెందుర్తి, గాజువాక, అనకాపల్లి పరిధిలో విస్తరించి ఉంది గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్. మొత్తం 98 డివిజన్లు ఉన్నాయి. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గ్రేటర్ విశాఖ పీఠాన్ని సొంతం చేసుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. 58 డివిజన్లను గెలుచుకొని గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసింది. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో అతి పెద్దదైన గ్రేటర్ విశాఖ పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని కూటమి భావిస్తోంది.
* పెరిగిన కూటమి బలం..
అయితే ఎన్నికలకు ముందు, ఫలితాలు వచ్చిన తర్వాత చాలామంది కార్పొరేటర్లు కూటమి పార్టీల్లో చేరారు. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి కూటమి బలం 70కు చేరినట్లు తెలుస్తోంది. దీంతో కూటమి నేతలు విశాఖ జిల్లా కలెక్టర్కు అవిశ్వాస తీర్మానంపై వినతి పత్రం అందించారు. ఆయన ఈనెల 19న అవిశ్వాస తీర్మానం కి సంబంధించి ఓటింగ్ ను ప్రకటించారు. అయితే కూటమి పక్కా వ్యూహంతో వెళ్తోంది. దాదాపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులను తమ వైపు తిప్పుకోవాలని చూస్తోంది. అదే జరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత విషాదంలో మునిగిపోవడం ఖాయం. అందుకే సీనియర్లుగా ఉన్న బొత్స, ఉత్తరాంధ్ర సమన్వయకర్త కన్నబాబు రంగంలోకి దిగారు. తమ పార్టీ కార్పొరేటర్ లను బెంగళూరు శిబిరానికి తరలించారు.
* ముందే జాగ్రత్త పడిన కూటమి..
అయితే గత అనుభవాల దృష్ట్యా కూటమి ముందే జాగ్రత్తలు తీసుకుంది. అందుకే తమ వైపు వచ్చిన కార్పొరేటర్లతో సహా టిడిపి సభ్యులను విదేశాలకు తరలించింది. ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో( Indian political history) ఓ నగరపాలక సంస్థ కార్పొరేటర్ లను ఇలా విదేశీ శిబిరాలకు తరలించడం ఇదే తొలిసారి. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు సైతం ఇదే తరహా డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. తమకు సైతం విదేశాలకు తరలించాలని వారు కోరడంతో వైసిపి హై కమాండ్ స్పందించింది. మలేషియా కు తరలించినట్లు తెలుస్తోంది. ఈనెల 19న విదేశాల్లో ఉన్న ఇరు పార్టీల కార్పొరేటర్లు నేరుగా అవిశ్వాస తీర్మాన ఓటింగ్ కు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది.
Also Read : పవన్ లక్కీగా డిప్యూటీ సీఎం అయ్యారు.. ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదు.