Gorantla Madhav: మాజీ మంత్రి గోరంట్ల మాధవ్( gorantla Madhav ) చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. గత కొంతకాలంగా ఆయన పై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అయితే జగన్మోహన్ రెడ్డి కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్కు తీసుకు వెళ్తుండగా గోరంట్ల మాధవ్ అడ్డగించారు. కిరణ్ ను తనకు అప్పగించాలని కోరగా అది వివాదంగా మారింది. ఈ తరుణంలో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇదే అదునుగా మరో కేసులో గోరంట్ల మాధవ్ కు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధపడుతున్నారు. దీంతో ఉచ్చులోకి గోరంట్ల మాధవ్ వెళ్ళారా? లేకుంటే గోరంట్ల మాధవ్ నే ఉచ్చులోకి లాగా రా? అన్నది హాట్ టాపిక్ అయింది. మొత్తానికైతే గోరంట్ల మాధవ్ వరుస కేసుల్లో చిక్కుకోవడం ఖాయమని తెలుస్తోంది. ఎలాగైనా ఆయనపై కేసులు నమోదు చేసేందుకు ఏపీ పోలీసులు సిద్ధపడుతున్నట్లు సమాచారం.
Also Read: జగన్ పై దారుణ కామెంట్స్ : కిరణ్ పాపం పండిందిలా..
* లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు..
జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) భద్రతపై గోరంట్ల మాధవ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్ పై. ఆడ కానీ.. మగా కానీ లోకేష్ కు కేంద్ర బలగాలతో భద్రత కల్పిస్తున్నప్పుడు.. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు రక్షణ కల్పించారు అంటూ గోరంట్ల మాధవ్ ప్రశ్నించారు. అయితే గోరంట్ల మాధవ్ ప్రెస్ మీట్ ప్రభుత్వానికి మంట తెచ్చి పెట్టినట్లు అయింది. అందుకే ఇప్పుడు ఆడ, మగ అని అనుచితంగా మాట్లాడిన గోరంట్ల మాధవ్ పై తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఓ టిడిపి నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోరంట్ల మాధవ్ కు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే గోరంట్ల మాధవ్ పై ఉన్న పాత కేసులను సైతం తెరపైకి తెచ్చే అవకాశం కనిపిస్తోంది.
* సరైన ఆధారాలతో..
గోరంట్ల మాధవ్ గత కొద్ది రోజులుగా దూకుడుగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం( Alliance government) పై విమర్శలు చేస్తున్నారు. అంతకుముందు వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఎంపీ హోదాలో టిడిపి నేతలను టార్గెట్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన అరెస్టు ఉంటుందని కూడా ప్రచారం జరిగింది. మొన్న ఆ మధ్యన నోటీసులు కూడా ఇచ్చారు. ఆయన విచారణకు సైతం హాజరయ్యారు. అయితే సరైన కేసులో.. సరైన ఆధారాలతో.. రోజుల తరబడి రిమాండ్ ఉంచేలా బలమైన కేసులు పెట్టాలని కూటమి ప్రభుత్వం భావించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు చేబ్రోలు కిరణ్ అరెస్టు సమయంలో హడావిడి చేయడం.. పోలీస్ విధులను అడ్డగించడం… లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం.. వంటి కారణాలతో కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గోరంట్ల మాధవ్ పై కేసులు పెట్టేందుకు కూటమి నేతలు సిద్ధపడుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
Also Read: ఛీ మారరు.. పవన్ కుమారుడుపై చీప్ కామెంట్స్.. పోలీసులు సీరియస్!