ని

ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు విధాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలకేంద్రం ఆ మధ్య సంచలన నిర్ణయం తీసుకుంది. గతేడాది జూలైలో నిర్ణయం తీసుకున్న కేంద్రం ఈ విధానాన్ని ఈ ఏడాది జూన్ వరకు దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకుంది. ఈ కరోనా కారణంగా ఆ ప్రక్రియలో కొంత జాప్యం జరిగింది. అయితే.. ఈ విధానం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిర్వహించిన రేషన్ పోర్టబిలిటీ ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ఇప్పుడు ఇరు రాష్ట్రాల్లో ప్రజలు ఎక్కడైనా రేషన్ తీసుకునే వెలుగుబాటు కలిగింది.
Also Read : మోదీకి ట్వీటర్లో కేటీఆర్ కౌంటర్
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ, ఏపీని ఒక క్లస్టర్‌గా గుర్తించింది. ఇరు రాష్ట్రాల ప్రజలు ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించింది. గతేడాది నిర్వహించిన ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో ఇప్పుడు పోర్టబిలిటీ విధానం అమల్లోకి తెస్తున్నారు. ఏపీ తెలంగాణతోపాటు మహారాష్ట్ర, గుజరాత్‌ను రెండు క్లస్టర్లుగా ఏర్పాటు చేసి గతేడాది ఆగస్ట 1 నుంచి ఈ విధాన్ని అమలు చేయాలనుకుంది కేంద్రం.
అందులోభాగంగానే తెలంగాణ రాష్ట్రంలో గతేడాది ట్రయల్ రన్ చేశారు. పంజాగుట్టలోని ఓ రేషన్ షాపులో ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన వారు రేషన్ తీసుకున్నారు. తెలంగాణలో ఈ విధానం సక్సెస్ కావడంతో.. రెండు రాష్ట్రాల మధ్య పోర్టబిలిటీ డెవలప్ చేశారు. ఇప్పటివరకు ఏపీలోని పలు జిల్లాల్లో 349 మంది తెలంగాణ రాష్ట్రంలో రేషన్ తీసుకున్నారు. రేషన్ పోర్టబిలిటితో ఇతర ప్రాంతాలకు చెందిన 1.34 లక్షల మందికి బియ్యంతోపాటు శనగలు ఉచితంగా ఇచ్చారు.
ప్రస్తుతానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అమలవుతున్న ఈ విధానం సక్సెస్ అయితే.. ఎలాంటి అవాంతరాలు లేకుండా దిగ్విజయంగా నడిస్తే.. దేశవ్యాప్తంగా ఈ విధానం అమలు చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.
Also Read : కోవిడ్ నిధులపై బండి-కేటీఆర్ కొట్లాట..!