Site icon OkTelugu

Garikapati latest controversy: కొత్త వివాదంలో ‘గరికపాటి’!

Garikapati latest controversy

Garikapati latest controversy

Garikapati latest controversy: ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి మరో వివాదంలో చిక్కుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులను శోభనం పెళ్ళికొడుకులతో పోల్చడం.. కోడిగుడ్లతో భోజనం పెట్టడం వంటి వాటిని ప్రస్తావిస్తూ గరికపాటి చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురిచేస్తున్నాయి. దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరాలతో పాటు విమర్శలు వస్తున్నాయి. ఈ తరుణంలో గరికపాటి బృందం రంగంలోకి దిగింది. దీనిపై వివరణ కూడా ఇచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వైరల్ అవుతోంది. నెటిజన్లు భిన్నంగా కామెంట్లు పెడుతున్నారు. అయితే తరచూ ఏదో ఒక వివాదంలో గరికపాటి చిక్కుకోవడం చూస్తుంటే మాత్రం వింత గొలుపుతోంది.

గతంలో కూడా..
గరికపాటి నరసింహారావు వివాదాల్లో చిక్కుకోవడం కొత్త కాదు. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి విషయంలో ఆయన చేసిన కామెంట్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి. మెగా అభిమానులకు కోపం తెచ్చి పెట్టాయి. ఎంతో హుందాగా ఉండే చిరంజీవిని ఓ వేదికపై అగౌరవంగా వ్యాఖ్యానాలు చేయడం పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. మెగా అభిమానులు స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. మెగా బ్రదర్ నాగబాబు అయితే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కానీ చిరంజీవి ప్రమేయంతో అప్పట్లో ఆ వివాదం సద్దుమణిగింది. అయితే ఇప్పుడు మధ్యాహ్న భోజనం, విద్యార్థుల చదువులు, ఉపాధ్యాయుల బోధనేతర కార్యక్రమాలు తదితర విషయాలపై కామెంట్స్ చేశారు గరికపాటి. అవి ఇప్పుడు పెను దుమారానికి దారితీస్తున్నాయి.

Also Read: చంద్రబాబుతో మమతాకు చెక్.. బిజెపి మాస్టర్ ప్లాన్!

క్లారిటీ ఇచ్చిన గరికపాటి బృందం
ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులు చదువుతుండగా.. వారికోసం ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకం నడిపిస్తోంది. అయితే యధాలపంగా దానిని తప్పు పట్టారు గరికపాటి నరసింహారావు. కోడిగుడ్లు పెడతారు. కడుపునిండా భోజనం పెడతారు. శోభనం పెళ్ళికొడుకు మాదిరిగా తయారు చేస్తారు. ఉపాధ్యాయులు ఏమో లెక్కలు చూస్తారు.. ఇలా గరికపాటి వ్యాఖ్యానాలు కొనసాగాయి. అయితే పేద ప్రజలతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయులను కించపరుస్తారా అంటూ… సోషల్ మీడియాలో గరికపాటి పై ముప్పేట దాడి జరుగుతోంది. దీనిపై స్పందించింది గరికపాటి బృందం. గరికపాటి వీడియోను పూర్తిస్థాయిలో వినాలని.. ఎవరో క్లిప్పులు పెట్టి తప్పుదారి పట్టించారని స్పష్టతనిచ్చింది. గరికపాటి ఎటువంటి తప్పుడు వ్యాఖ్యానాలు చేయలేదని తేల్చి చెప్పింది.

Exit mobile version