Duvvada Srinivas and Madhuri: తెలుగు రాష్ట్రాల్లో సినీ సెలబ్రిటీలకు మించి గుర్తింపు సాధించారు దువ్వాడ శ్రీనివాస్( duvvada Srinivas ), దివ్వెల మాధురి జంట. వీరు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. మాధురి పుట్టినరోజు సందర్భంగా ఓ ఫామ్ హౌస్ లో నిర్వహించిన పార్టీపై పోలీసులు దాడి చేసినట్లు సమాచారం. అనుమతి లేకుండా మద్యం, హుక్కా పరికరాలతో పార్టీ చేసుకుంటున్నారని సమాచారంతో పోలీసులు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ ఘటనతో వీరిద్దరూ పోలీసుల అదుపులోకి వెళ్లినట్లు సమాచారం. గత కొద్దిరోజులుగా వీరి హడావిడి తగ్గిందనుకుంటున్న తరుణంలో మరోసారి ఈ ఘటన వెలుగు చూడడం విశేషం.
* బర్త్డే పార్టీ భగ్నం..
ఏడాదిన్నర కాలంగా ఈ జంట తెలుగు నాట విశేష ప్రాచుర్యం పొందింది. ఇటీవల మాధురి బిగ్ బాస్ లో( Bigg Boss) పాల్గొని తన పాపులారిటీని మరింత పెంచుకున్నారు. ఈ లవ్ బర్డ్స్ గురించి నిత్యం ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. తాజాగా మాధురి బర్త్డే పార్టీని పోలీసులు భగ్నం చేయడంతో మరోసారి ఈ జంట వార్తల్లో నిలిచింది. నిన్ననే మాధురి బర్త్డే సందర్భంగా మోయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో పార్టీ నిర్వహించారు. అయితే అనుమతి లేకుండా మద్యం తీసుకుంటున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
* పక్కా సమాచారంతో..
దువ్వాడ శ్రీనివాస్ మాధురి బర్త్డేను రిచ్ గా ప్లాన్ చేశారు. పరిమిత కుటుంబ సభ్యులను మాత్రమే ఈ కార్యక్రమానికి పిలిచారు. పార్టీలో మద్యంతో పాటు మత్తు పదార్థాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఈ పార్టీ గురించి స్థానిక పోలీసులకు పక్క సమాచారం అందడంతోనే దాడి చేసి భగ్నం చేశారట. పది విదేశీ మద్యం బాటిళ్లు, ఏడు హుక్కా పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్, మాధురి జంట పోలీసుల అదుపులోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చారు మాధురి. వైల్డ్ కార్డు ఎంట్రీ గా వెళ్లారు. తిరిగి వచ్చేసారు. అప్పటినుంచి ఆమె పాపులారిటీ పెరిగింది. ఇంతలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.
దువ్వాడ మాధురి బర్త్ డే పార్టీ భగ్నం..!
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని పెండెంట్ ఫామ్‌హౌస్‌లో దువ్వాడ మాధురి బర్త్ డే పార్టీని భగ్నం చేసిన రాజేంద్రనగర్ పోలీసులు
ఆ పార్టీలో ఆమెతో పాటు దువ్వాడ శ్రీనివాస్ ఇతర కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం
ఎలాంటి అనుమతి లేని 10 విదేశీ… pic.twitter.com/6vMUNBVmTI
— BIG TV Breaking News (@bigtvtelugu) December 12, 2025