Homeఆంధ్రప్రదేశ్‌Duvvada Ignores Jagan Words: జగన్ మాటలను లెక్కచేయని దువ్వాడ!

Duvvada Ignores Jagan Words: జగన్ మాటలను లెక్కచేయని దువ్వాడ!

Duvvada Ignores Jagan Words: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు దువ్వాడ శ్రీనివాస్( duvvada Srinivas ). ఇటీవల జగన్మోహన్ రెడ్డికి ఎదురుపడిన దువ్వాడకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావేమిటి? సినిమా హీరో అనుకున్నావా? అని చివాట్లు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. అన్నా అన్ని వివాదాలు సరి చేసుకుంటాను. మిమ్మల్ని ప్రత్యేకంగా కలుస్తాను.. అంటూ దువ్వాడ శ్రీనివాస్ బదులు ఇచ్చినట్లు ప్రచారం నడిచింది. అయితే దువ్వాడ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని అర్థం అవుతోంది. ఇంకా రీల్స్.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. తాజాగా శ్రీశైలంలో మహాశివరాత్రి సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట హల్ చల్ చేసింది. దీంతో జగన్ అంటే దువ్వాడకు డోంట్ కేర్ అని తేలిపోయింది.

ఎప్పుడు ప్రముఖ ఆలయాల్లో..
దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి( Divvela Madhuri) జంటకు భక్తి భావం ఎక్కువ అన్నట్టు ఉంది. ఏమైనా పండుగలు వస్తే చాలు పుణ్యక్షేత్రాల్లో వాలిపోతుంటారు. ఆ సమయంలో అక్కడ దేవుడి కంటే వారిద్దరే బాగా హైలైట్ అవుతున్నారు. అక్కడ రెడీగా ఉండే మీడియా ప్రతినిధులు చకచకా నాలుగు ఫోటోలు, కుదిరితే రెండు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. నిజంగా అది వారి అదృష్టమే. ఎందుకంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత కంటే దువ్వాడ ఎంతో పాపులర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు మించి ఆ జంటకు ఆదరణ కనిపిస్తోంది. సహజంగా పాపులారిటీ కోరుకునే వారికి ఇది మేము కూడా పడని విషయం.

అంత మాట అన్నాక కూడా..
ఏంటి సినిమా హీరో అనుకుంటున్నావా? అని జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) ప్రశ్నించిన తర్వాత కూడా దువ్వాడ శ్రీనివాస్ పట్టించుకోనట్టు ఉన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో జగన్మోహన్ రెడ్డి కలిసిన తర్వాత కూడా దువ్వాడ శ్రీనివాస్ సాటి వైసిపి నేతలపై విమర్శలు చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆ మాట అన్నారో దువ్వాడ శ్రీనివాస్ కు తెలుసు. అయినా సరే దువ్వాడ శ్రీనివాస్ తన వైఖరి మార్చుకోలేదు. ఎంచక్కా శ్రీశైలంలో దివ్వెల మాధురితో తేల్చేశారు. ఎవరు చెప్పినా డోంట్ కేర్ అన్నట్టు వ్యవహరించారు. అంటే దువ్వాడ శ్రీనివాస్ వైసీపీలో రీఎంట్రీ ఉండదని ఒక నిర్ణయానికి వచ్చారన్నమాట. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular