Medical Services In Uddanam: ‘వైద్యో నారాయణో హరి’ అన్నది భారతీయ సంస్కృతి. ప్రాణం పోసేది బ్రహ్మ అయితే.. పునర్జన్మ నిచ్చేది వైద్యులు.. అందుకే వైద్యో నారాయణ హరి అంటారు. వైద్యుడు దేవుడితో సమానం. కనిపెంచిన తల్లిదండ్రులు, విద్యాబుద్ధులు నేర్పించే గురువు తర్వాత దేవుడిగా భావించేది వైద్యుడినే.తల్లిదండ్రులు జన్మనిస్తే..వైద్యుడు పునర్జన్మనిస్తాడు.. తన కష్టనష్టాలను పక్కనబెట్టి రోగుల సేవలో తరిస్తాడు.. అత్యవసర పరిస్థితుల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి నమ్ముకొని వచ్చిన వారిని రక్షిస్తాడు. అందుకే మన పెద్దలు వైద్యో నారయణోహరి అన్నారు. అన్ని వృత్తుల్లోకెల్లా వైద్యవృత్తి పరమ పవిత్రమైనది. మన శరీరంలో ఏ సమస్య వచ్చినా, ఏదేని ప్రమాదం జరిగినా డాక్డర్ వద్దకే పరుగెడుతాం. మన ప్రాణాలను వారి చేతిలో ఉంచుతాం. అలాంటి విపత్కర పరిస్థితుల్లో వైద్యులందించే సేవలు శ్లాఘనీయం.అనుక్షణం రోగుల సేవలో తరిస్తూ శారీరక, మానసిక ైస్థెర్యాన్ని పెంపొందించేందుకు తపించే వైద్యులకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. ఆ ప్రాణదాత పోసిన ఊపిరి, ప్రతి ఉచ్ఛ్వాసలో ఆయనకు కృతజ్ఞత తెలుపుతూనే ఉంటుంది. రోగి గుండె ప్రతి లయనోనూ వైద్యుడి పేరునే పలకరిస్తూ ఉంటుంది.అయితే ఉద్దానం ప్రాంతంలో అటువంటి సేవలు అందించి అందరి మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు డాక్టర్ మలిపెద్ది మల్లేశ్వరరావు. గుండె వ్యాధి నిపుణులుగా, సుగర్ వ్యాధిగ్రస్తుల డాక్టర్ గా ఈ ప్రాంతంలో సుపరిచితులు. ఒకటి కాదు..రెండు కాదు.. ఏకంగా 34 ఏళ్ల పాటు నిర్విరామంగా వైద్యసేవలు అందించగలుగుతున్నారంటే ఆయన ఏ స్థాయిలో సేవలందించారో ఇట్టే అర్థమవుతోంది.
మూడున్నర దశాబ్దాల కిందట..
అది 1992 సమయం…వైద్యం, వైద్యసేవలు అంతంతమాత్రంగా అందుతున్న సమయం అది. అటువంటి సమయంలోనే జంట పట్టణాలకు అందుబాటులోకి వచ్చింది ఓ ఆస్పత్రి. మూడు పదుల వయసు ఉన్న యువ డాక్టర్ సేవలు అందించడం ప్రారంభించాడు. ఎన్నో వేల మందికి ‘గుండె’భరోసా ఇచ్చారు. అప్పటివరకూ గుండెపోటు వస్తే విశాఖ, హైదరాబాద్ వెళ్లాల్సిందే. అటువంటి సమయంలో ప్రాణనష్టమే అధికం. కానీ ఆ యువ డాక్టర్ మాత్రం గుండెపోటుకు ప్రథమ చికిత్స అందించారు. ఈ మూడు దశాబ్దాల కాలంలో వేలాది మంది గుండెకు భరోసా ఇచ్చారు. ఆయనే డాక్టర్ మలిపెద్ది మల్లేశ్వరరావు. ఇచ్ఛాపురం నుంచి సంతబొమ్మాళి వరకూ… మందస నుంచి పాతపట్నం వరకూ లక్షలాది మంది ప్రజలకు వైద్య బ్రహ్మ అయ్యారు. ఇప్పటికీ డాక్టర్ బాబు అంటే మనసుపెట్టి వైద్యం చేస్తారు. సామాన్యులతో సైతం చిరునవ్వుతో మాట్లాడి వారి రోగాన్ని నయం చేస్తుంటారు.
నిజంగా హ్యాట్సాప్..
అయ్యా..నీకు కిడ్నీ సంబంధిత సమస్య ఉంది. ప్రభుత్వం పెద్ద కిడ్నీ ఆస్పత్రి ఏర్పాటుచేసింది. అక్కడ అన్నిరకాల సదుపాయాలు ఉన్నాయి. ఎక్స్ రే, స్కానింగ్ అన్నీ ఉచితమే. మందులు సైతం ఉచితంగా అందిస్తారు. అక్కడకు వెళ్లిపో అయ్యా. నీకు మంచి వైద్యం ఉచితంగా అందిస్తారు.. ఇలా తన దగ్గరకు వచ్చిన రోగులకు సలహా ఇస్తుంటారు డాక్టర్ మల్లేశ్వరరావు. ఇలా చెప్పేందుకు సాహసం చేయాలి. ఆపై పేద ప్రజలపై ఎనలేని దయ ఉండాలి. మా ఆస్పత్రికి తీసుకొస్తే కమీషన్లు ఇస్తామని చెబుతున్న ఈ రోజుల్లో కూడా ప్రభుత్వాస్పత్రికి వెళ్లండని సూచించడం డాక్టర్ మల్లేశ్వరరావు సేవా గుణానికి నిదర్శనం.
దశాబ్ద కాలం కిందటే టెనెక్టిప్లేస్
ఈ రోజుల్లో గుండె జబ్బు బాధితులు వయస్సుతో సంబంధం లేకుండా పెరుగుతున్నారు. అంతే కాకుండా.. ఎక్కువ మంది చనిపోతున్నారు. సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లకపోవడం, తీసుకెళ్లినా.. సరైన వైద్యం అందకవడం వల్ల అనర్థాలు జరుగుతున్నాయి. కానీ టెనెక్టిప్లేస్ ఇంజెక్షన్‌తో ప్రాణాలు కాపాడుకోవచ్చు. కానీ ఇదో ఖరీదైన ఇంజక్షన్ . అందుబాటులోకి తేవడం కూడా చాలా కష్టం. ఇంజక్షన్ నిర్వహణ కూడా కష్టంతో కూడుకున్న పని. కానీ తన వద్దకు వచ్చే రోగుల కోసం దశాబ్దాల కిందట ఈ ఇంజక్షన్లు అందుబాటులో ఉంచారు డాక్టర్ మల్లేశ్వరరావు. ఇప్పటికీ చాలా మంది ఈ సూది మందుతో వేలాది మంది ప్రాణాలను నిలిపారు.గుండెపోటుతో మరణిస్తున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. కానీ డాక్టర్ మల్లేశ్వరరావు వద్దకు వచ్చిన వారు సురక్షితంగా తరలి వెళతారన్న పేరును సొంతం చేసుకున్నారు.
ఇంతింతై వటుడింతై..
గత 34 సంవత్సరాలుగా సేవలందిస్తోంది రాజేశ్వరి నర్సింగ్ హోం. 1992లో ప్రారంభమైన ఈ వైద్యశాల ఇంతింతై వటుడింతై అన్నట్టు నిరుపమానంగా సేవలందిస్తోంది. జంట పట్టణాల్లో ఈ ఆస్పత్రి ఒక ల్యాండ్ మార్కు. నిరుపేద నుంచి ప్రముఖుల వరకూ అందరికీ సుపరిచితం కూడా. 30 పడకలతో పాటు ఐసీయూ, స్కానింగ్,అంబులెన్స్, అత్యాధుని వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. 24 గంటల పాటు ఇక్కడ సేవలందుతున్నాయి. సాధారణ రుగ్మత నుంచి ఊపిరితిత్తులు, సుగర్ సంబంధిత వ్యాధులకు సైతం సత్వర వైద్యం అందుతుంది ఇక్కడ.
త్వరలో మరో అరుదైన వైద్యసేవ..
ఇటీవల గ్యాస్ట్రిక్ సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయి. వైద్యం కోసం విశాఖ నగరానికి వెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో జంట పట్టణాల్లో గ్యాస్ట్రో అంట్రాలజిస్టుగా డాక్టర్ మల్లేశ్వరరావు కుమారుడు డాక్టర్ వివేక్ వర్థన్ అందుబాటులోకి రానున్నారు. పెరుగుతున్న గ్యాస్ సమస్యలతో రోగులు విశాఖకు క్యూకడుతున్నారు. కానీ ప్రముఖ వైద్యుల వద్ద సేవలు పొందాలంటే రోజుల తరబడి సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో గ్యాస్టోఅంట్రాలజీలో ఎండీ,డీఎం పూర్తిచేసిన డాక్టర్ వివేక్ వర్థన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.