CRDA Commissioner Kannababu Transfer: సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు( crda Commissioner kannababu ) బదిలీ వెనుక ఉన్న కారణం ఏంటి? రాజకీయ కారణాలతోనే ఆయన బదిలీ జరిగిందా? అనేది పొలిటికల్ వర్గాల్లో ఉన్న అనుమానం. ఆయన దాదాపు 14 నెలలపాటు సిఆర్డిఏ కమిషనర్ గా వ్యవహరించారు. అంతకుముందు కాటంనేని భాస్కర్ ఉండేవారు. అయితే ఆయన స్వల్పకాలంలోనే బదిలీ అయ్యారు. దానికి కారణం లేకపోలేదు. మంత్రి నారాయణతో ఆయనకు పడకపోవడంతోనే అప్పట్లో ప్రభుత్వం ఆయనను బదిలీ చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాది జనవరిలో సిఆర్డిఏ కమిషనర్ గా కన్నబాబు వచ్చారు. ఇప్పుడిప్పుడే ఆయన కుదురుకుంటున్న తరుణంలో ఆయనపై బదిలీ వేటు జరిగింది. ఆయన స్థానంలో పాఠశాల విద్యాశాఖ నుంచి విజయరామరాజు వచ్చారు. అయితే ఆయన శాశ్వతంగా ఉంటారా? తాత్కాలికమా? అన్నది తెలియడం లేదు.
Also Read: అసెంబ్లీలో ‘గులాబీ’ ఫైట్: కెప్టెన్ కేసీఆర్ లేని గ్రౌండ్.. రేవంత్ ‘సిక్స్’ల పండగ!
* ఆ భేటీయే కారణమా?
అయితే కన్నబాబు ఆకస్మిక బదిలీ వెనుక అనేక రకాల ప్రచారాలు ఉన్నాయి. అధికార వర్గాల్లో సైతం విస్మయం వ్యక్తం అవుతోంది. రాజకీయ కారణాలతోనే కన్నబాబు బదిలీ జరిగిందన్నది ప్రధాన అనుమానం. ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సిఎస్ గా పనిచేసిన వ్యక్తి ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన సలహాలు సూచనల కోసమే ఈ సమావేశం పెట్టినట్లు ప్రచారం నడుస్తోంది. ఈ సమావేశానికి కన్నబాబు హాజరయ్యారని ఒక టాక్ అయితే ఉంది. ఇది తెలిసి ప్రభుత్వం వేటు వేసిందని ప్రచారంలో ఉంది. కానీ ఒక ఐఏఎస్ అధికారిగా సిఆర్డిఏ కమిషనర్ లాంటి పెద్ద పోస్టులో ఉండడం గొప్ప విషయం. అంతకంటే ఇంకా ఏం కావాలని ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం ప్రయత్నిస్తారు అనేది ఒక అనుమానమే. అది అంత మాత్రం వాస్తవం కాదన్న వారు ఎక్కువ మంది ఉన్నారు.
* రైతుల ఫిర్యాదుతోనే?
మరోవైపు అమరావతి( Amravati capital ) రైతుల నుంచి ఫిర్యాదులు రావడంతోనే కన్నబాబును మార్చారన్న ప్రచారం ఉంది. అయితే ఈ విషయంలో మాత్రం వాస్తవం ఉంది. కన్నబాబు ప్రారంభంలో బాధ్యతలు తీసుకున్న సమయంలో ఇటువంటి ఫిర్యాదులు వచ్చాయి. కానీ వాటన్నింటినీ అధిగమించి కన్నబాబు బాగానే సెట్ అయ్యారు సి ఆర్ డి ఏ కమిషనర్ గా. మరోవైపు కాంట్రాక్టర్ల ఫిర్యాదు నేపథ్యంలోనే బదిలీ చేశారన్న వాదన ఉంది. ఇటీవల కన్నబాబు ఒక సాఫ్ట్వేర్ తయారు చేశారు. అమరావతి పనులకు సంబంధించిన ప్రగతి ఎప్పటికప్పుడు గుర్తించే సాఫ్ట్వేర్ అన్నమాట. ఒక డాష్ బోర్డు మాదిరిగా ఆ సాఫ్ట్వేర్ తయారు చేశారు. అయితే దీనిపై కాంట్రాక్టర్లు ఆవేదనతో ఉన్నారు. ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతోనే కన్నబాబును తొలగించారు అన్నది ఒక వాదన.
* దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు..
అమరావతి రాజధాని అనేది ఒక వ్రతంలా చేయాలి. ఒక ఉద్యమంలా నిర్మాణం చేపట్టాలి. దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు అది. అటువంటి ప్రాజెక్టుకు సిఆర్డిఏ కమిషనర్ కీలకం. కానీ ఇలా ఎప్పటికప్పుడు కమిషనర్లు మార్చడం ద్వారా ఆ ప్రభావం పనులపై పడుతుంది. ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ అమరావతి రాజధాని పనుల్లో జాప్యం జరుగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఇటువంటి సమయంలో రకరకాల కారణాలు చెప్పి కమిషనర్లను మార్చడం మాత్రం సహేతుకం కాదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇప్పుడు వస్తున్న కమిషనర్ విజయరామరాజు శాశ్వతమా? తాత్కాలికమా? అన్నది తెలియాల్సి ఉంది.
