
కరోనా నేపథ్యం ఇంకా వీడలేదు. మొదటి, రెండో దశలు మనుషులను తీవ్ర ఇబ్బందులుకు గురి చేశాయి. ప్రస్తుతం రెండో దశ ఇంకా తొలగిపోలేదని చెబుతున్నారు శాస్ర్తవేత్తలు. ఇప్పటికే మూడో దశ ముప్పు కూడా మొదలవుతుందని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడింది. నిబంధనలు కఠినంగా అమలు చేసే విధంగా కసరత్తు చేస్తున్నారు. మూడో దశ కనుక వ్యాపిస్తే తరువాత పాటించాల్సిన పద్ధతులపై ఇప్పటికే జాగ్రత్తలపై దృష్టి సారించాల్సి ఉంది. డెల్టా వేరియంట్ తో ప్రపంచం అతలాకుతలమవుతున్న తరుణంలో మానవాళికి సూచనలు చేస్తున్నారు.
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా నిబంధనలు కఠినతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మాస్కుుల ధరించని వారిపై జరిమానా విధించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కార్యాలయాలు, సంస్థలు, వ్యాపార సముదాయాలు, దుకాణాలు తదితర వాటిల్లో మాస్కులు ధరించకుండా ఉంటే వారికి రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధిస్తామన రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు.
కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే గుర్తించి ఆ ఫొటోలు పంపితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనికి ప్రత్యేకంగా 8010968895 వాట్సాప్ నెంబర్ కేటాయించారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ర్ట వ్యాప్తంగా మరో రెండు వారాల పాటు రాత్రి వేల కర్ఫ్యూ పొడిగించినట్లు పేర్కొన్నారు. కరోనా విజృంభించే అవకాశం ఉన్న సందర్భంలో ప్రజలు నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని చెబుతున్నారు.
ఆగస్టు 14 వరకు కర్ఫ్యూ ఆంక్షలు ప్రతి రోజు రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటుందన్నారు. కొవిడ్ నిబంధనలు పాటించకుండా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. మాస్కులు ధరించని వారికి రూ.100 జరిమానా విధించే అధికారం పోలీసులకు అప్పగించారు. దీంతో ప్రభుత్వం కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించే విధంగా చర్యలు తీసుకోవడంతో ప్రజలు సహకరించాలని కోరుతున్నారు.