YV Subba Reddy: ఇటీవల ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్నారు పేరు విక్రాంత్ రెడ్డి. వై వి సుబ్బారెడ్డి కుమారుడు ఈ విక్రాంత్ రెడ్డి. వయస్సు 3 పదుల లోపే. కాకినాడ పోర్టు వాటాదారుల నుంచి బలవంతంగా, భయపెట్టి వాటాలు లాక్కున్న వారిలో ఇప్పుడు విక్రాంత్ రెడ్డి పేరు వినిపిస్తోంది. విజయసాయిరెడ్డి తో పాటు విక్రాంత్ రెడ్డి తనను బెదిరించి వాటాలు లాక్కున్నారని ఒకప్పటి కాకినాడ పోర్ట్ వాటాదారుడు కెవి రావు సిఐడి కి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన సిఐడి వీరిద్దరూ విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసింది. అయితే అంత చిన్న పిల్లాడిని పట్టుకొని కేసులు నమోదు చేస్తారా అని విజయసాయిరెడ్డి విక్రాంత్ రెడ్డిని ఉద్దేశించి.. ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే విక్రాంత్ రెడ్డి చిన్నపిల్లాడు కాదు. గత ఐదేళ్లుగా చాలా వ్యవహారాల్లో ఆయన పాత్ర ఉందని టాక్ నడుస్తోంది. ఇప్పుడిప్పుడే ఆ వ్యవహారాలు బయటపడుతున్నాయి. కనీసం రాజకీయాల్లో లేని విక్రాంత్ రెడ్డి ఆ స్థాయిలో ప్రధాన భూమిక వహించారంటే దీని వెనుక చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. జగన్ బినామీ విక్రాంత్ రెడ్డి అంటూ కొత్త ప్రచారం ప్రారంభం అయ్యింది.
* వైఎస్ మరణం తర్వాతే రాజకీయాల్లోకి
అయితే వైవి సుబ్బారెడ్డి స్వయానా జగన్ కు బాబాయ్. రాజశేఖర్ రెడ్డి కి స్వయానా తోడల్లుడు. మరదలి భర్త. కానీ రాజశేఖర్ రెడ్డి బతికున్నంత కాలం వై వి సుబ్బారెడ్డి పేరు వినిపించలేదు. కానీ అదే వైవి సుబ్బారెడ్డి సోదరి భర్త అయిన బాలినేని శ్రీనివాస్ రెడ్డిని రాజశేఖర్ రెడ్డి ప్రోత్సహించారు. అయితే రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వై వి సుబ్బారెడ్డి పొలిటికల్ ఎంట్రీ కి గ్రీన్ సిగ్నల్ లభించింది. అయితే ఒకవైపు బాలినేని కొనసాగిస్తూనే బాబాయి వైవి సుబ్బారెడ్డికి పెత్తనమంతా కట్టబెట్టారు జగన్. ఇన్ డైరెక్ట్ గా విక్రాంత్ రెడ్డికి అప్పగించారన్నమాట. గత ఐదేళ్లుగా అడ్డగోలు దోపిడీ వెనుక విక్రాంత్ రెడ్డి ఉన్నట్లు ప్రత్యర్థులు అనుమానిస్తున్నారు. ఎంతో చలాకీగా కనిపించే విక్రాంత్ రెడ్డి రాజకీయాల్లోకి ముందుకు రాకపోవడానికి బినామీ తంతు కారణమని తెలుస్తోంది.
* తెర వెనుక బాలినేని?
అయితే బాలినేని జనసేనలో చేరిన తరువాత ఈ వ్యవహారాలన్నీ బయటపడుతుండడం విశేషం. వీటి వెనుక బాలినేని ఉన్నారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే మరో విషయం ఏంటంటే షర్మిల, జగన్ మధ్య వివాదంలో వైవి సుబ్బారెడ్డి జగన్ ని సమర్థించారు. షర్మిలను తప్పుపట్టారు. అయితే వైవి సుబ్బారెడ్డి వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు విజయమ్మ. అయితే వైవి సుబ్బారెడ్డి అడ్డగోలుగా జగన్ ను వెనకేసుకు రావడం పై కుమారుడు విక్రాంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి వైవి స్వయానా వదిన విజయమ్మ. తప్పకుండా ఆయనవిజయమ్మ మాటకు ప్రాధాన్యం ఇవ్వాలి. షర్మిలకు న్యాయం జరిగేలా చూడాలి. కానీ వైవి సుబ్బారెడ్డి ఆది నుంచి జగన్ కు మద్దతు తెలుపుతున్నారు. షర్మిలను తప్పుపడుతున్నారు. ఇదంతా గత ఐదేళ్లుగా తన కుమారుడు నడిపిన బినామీ బాగోతమే కారణమని తెలుస్తోంది. అది ఎక్కడ బయటపడుతుందోనన్న అనుమానంతోనే ఆయన జగన్ ను సపోర్ట్ చేస్తున్నట్లు సమాచారం. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Controversies surround yv subbareddys son
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com