CM Chandrababu: కొందరు రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలు శాపంగా మారుతాయి. తప్పటడుగులు ఎదుగుదల లేకుండా చేస్తాయి. ఏపీలో అటువంటి నేతలకు కొదువ లేదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ( Telugu Desam Party) ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన చాలామంది నేతలు మధ్యలో తప్పటడుగులు వేశారు. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. దానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. అటు వారసులకు సరైన రాజకీయ భవిష్యత్తు ఇవ్వలేదన్న బెంగ వారిని వెంటాడుతోంది. అటువంటి నేతలు పొలిటికల్ జంక్షన్ లో నిలబడ్డారు. మాతృ పార్టీలోకి వెళ్లలేక.. ఇతర పార్టీల్లో ఉండలేక సతమతమవుతున్నారు. అధినేత చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారు.
Also Read: గోదావరి జిల్లాల రొయ్యకు ట్రంప్ దెబ్బ!
* మాజీ మంత్రి పడిగాపులు..
మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు( Avanthi Srinivasa Rao ) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చాలా రోజుల కిందట రాజీనామా చేశారు. ఆయనకు ఈరోజు వరకు టిడిపి హై కమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించలేదు. 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు అవంతి శ్రీనివాసరావు. అటు తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా భీమిలి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్ క్యాబినెట్లో మంత్రి అయ్యారు. కానీ 2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు అదే పార్టీకి గుడ్ బై చెప్పి పొలిటికల్ జంక్షన్ లో నిలబడ్డారు. టిడిపిలో చేరుతామంటే ఆ పార్టీ నుంచి ఇంతవరకు గ్రీన్ సిగ్నల్ లభించలేదు.
* వైసీపీలోకి వెళ్లిన ప్రయోజనం లేదు
మరోవైపు మాజీ మంత్రి సిద్దా రాఘవరావు ( Siddha raghavarao) సైతం సైకిల్ ఎక్కేందుకు ఉబలాటపడుతున్నారు. 1999లో తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు రాఘవరావు. 2014లో దర్శి టిక్కెట్ లభించింది ఆయనకు. టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అటు తరువాత చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి అయ్యారు. 2019 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఓటమి ఎదురయ్యేసరికి ఫుల్ సైలెంట్ అయ్యారు. కొద్ది రోజులకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. తన కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన వైయస్సార్ కాంగ్రెస్ లో చేరారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పదవులు ఇవ్వలేదు. ఈ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తెలుగుదేశం పార్టీలో చేరుతానని భావిస్తున్నారు. కానీ అధినేత నుంచి ఇంతవరకు గ్రీన్ సిగ్నల్ లభించలేదు.
ప్రకాశం జిల్లా సీనియర్ నాయకుడు కరణం బలరాం ది( karanam Balaram ) అదే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన చంద్రబాబుతో పాటు టిడిపిలోకి వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబుకు సమకాలీకుడు. కానీ రాజకీయంగా నిర్ణయాలు తీసుకోవడంలో తప్పటడుగులు వేశారు. ఎంపీ తో పాటు ఎమ్మెల్సీ అయ్యారు కానీ.. ఇంతవరకు బలరాం మంత్రి కాలేయకపోయారు. ప్రకాశం జిల్లాలో సుదీర్ఘకాలం రాజకీయాలు చేశారు. తెలుగుదేశం పార్టీ బాధ్యతలు తీసుకున్నారు. 2019లో అనూహ్యంగా చీరాల నుంచి గెలిచారు. పార్టీ అధికారంలోకి రాకపోవడంతో కుమారుడి కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. 2024 ఎన్నికల్లో బలరాం కుమారుడు వెంకటేష్ సైతం వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన సైతం మాతృ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధపడుతున్నారు. కానీ అధినేత చంద్రబాబు నుంచి ఇంతవరకు గ్రీన్ సిగ్నల్ లభించలేదు.
* పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు..
అయితే ఈ నాయకులంతా తెలుగుదేశం పార్టీ ద్వారా లబ్ధి పొందిన వారే. రాజకీయంగాను, ఆర్థికంగాను బలోపేతం అయ్యారు. కానీ పార్టీ కష్టకాలంలో ఉండగా కాదని వెళ్లిపోయారు. అందుకే ఇప్పుడు వారిని పార్టీలో చేర్చుకుంటే శ్రేనులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని నాయకత్వం భయపడుతోంది. అందుకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వనట్లు తెలుస్తోంది.