CM Chandrababu: ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతుంది. మరో నాలుగు నెలల్లో రెండేళ్ల పాలన పూర్తిచేసుకోనుంది. రాజకీయంగా బలపడేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టి ప్రయత్నం లోనే ఉంది. మరోవైపు ప్రభుత్వ పెద్దలు గట్టిగానే కృషి చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అధికార కూటమి ఎమ్మెల్యేలు బాధ్యతగా వ్యవహరించాలి. కానీ వారు ప్రజా జీవితంలో ఉన్నామన్న స్పృహ లేకుండా వ్యవహరిస్తున్నారు. తాజాగా జనసేన ఎమ్మెల్యే రాసలీలల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గతంలో కూడా చాలామంది ఎమ్మెల్యేలపై ఆరోపణలు రాగా.. సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పటి ఎమ్మెల్యేలపై ఇటువంటి ఆరోపణలు రావడం.. నాయకత్వం పట్టించుకోకపోవడం ప్రజా గ్రహానికి కారణం అయింది.. కనీసం దాని నుంచి ఇప్పుడు కూటమి పార్టీల ఎమ్మెల్యేలు గుణపాటాలు నేర్చుకోలేదు.
* ప్రైవేటు వ్యవహారాలు..
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి వివాదం గా మారింది. కొంతమంది తమ ప్రైవేటు వ్యవహారాలను సైతం రచ్చ చేసుకుంటున్నారు. ఇక్కడ వారు ఒక విషయం గుర్తించుకోవడం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కాలకేయ సోషల్ మీడియా సైన్యం ఉంది. ప్రతి కూటమి ఎమ్మెల్యే పై వ్యక్తిగత మెగా కొనసాగుతోంది. ఏమాత్రం అనుమానం ఉన్నా.. వారిపై కర్నేసి ఉంచుతాంది వైసీపీ సోషల్ మీడియా. ఈ నేపథ్యంలోనే చాలామంది నేతల ప్రైవేటు వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. వారి రాజకీయ జీవితానికి మాయని మచ్చగా మారడంతో పాటు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి. అయితే ఈ విషయంలో సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. కానీ ఎమ్మెల్యేల వైఖరిలో మార్పు రావడం లేదు. ఈ విషయంలో కూటమి పార్టీల నాయకత్వాలు కఠినంగా వ్యవహరించకపోతే మున్ముందు ఇటువంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉంటాయి.
* సానుకూలత సమయంలో..
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం( state government) దూకుడుగా ముందుకు సాగుతోంది. పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. అమరావతి రాజధాని నిర్మాణం కూడా చురుగ్గా సాగుతోంది. ప్రభుత్వం పట్ల సానుకూలత ఉంది. ఇటువంటి సమయంలో ఎమ్మెల్యేల వైఖరి ప్రభుత్వానికి నష్టం చేకూర్చేలా ఉంది. ఈ కారణాలతో నైతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు పక్కన పెట్టారో.. వాటి జోలికి వెళ్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు. కచ్చితంగా ఎమ్మెల్యేల వైఖరి విషయంలో ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. పార్టీ లైన్ దాటిన వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించాలి. లేకుంటే మాత్రం ఇబ్బందికరమే. ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి రాజకీయపరంగా ఇబ్బందులు రాకూడదు. అప్పుడే ప్రభుత్వం స్వేచ్ఛగా పనిచేయగలదు.