Chandrababu Arrest : చంద్రబాబు అరెస్ట్.. ఉదయం నుంచి లోకల్ మీడియా కోడై కూస్తోంది. అంతటి జీ-20 సభల కవరేజీని కూడా పక్కన పెట్టింది. సాక్షి పోలీసుల కోణంలో, ఈనాడు, జ్యోతి బాబు కోణంలో వార్తలను ప్రజెంట్ చేయడం మొదలు పెట్టాయి. సరే అవన్నీ పార్టీల మీడియా సంస్థలు. వాటి నుంచి అంతకు మించి మనం ఆశించలేం. చంద్రబాబు అరెస్ట్ పట్ట పురందేశ్వరి స్పందించింది. ఇది దారుణమని వ్యాఖ్యానించిం ది. సరే అందరూ ఊహించన స్పందనే అది. మరీ బాబు అరెస్ట్ పట్ల బీజేపీ పెద్దలు మౌనంగా ఉన్నారు. పైకి జీ-20 సమావేశాలు అని చెబుతున్నప్పటికీ అల్‌రెడీ ఇండైరెక్టుగా సంకేతాలు వెలువడ్డాయి. అందుకే జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది.
జగన్ బీజేపీ పెద్ద తలకాయలకు చెప్పకుండా ఈ అరెస్ట్ చేసి ఉండడు. మోడీకి, అమిత్ షాకు కూడా ముందే తెలి సి ఉంటుంది. చంద్రబాబు మీద వాళ్లకు ఏమాత్రం సదా భిప్రాయం లేదు. అందుకే బాబు ఎంత ప్రయత్నిం చినా మోడీ, షా దేకలేదు. గతంలో బాబు చేసిన వ్యాఖ్యలు, న మ్మకద్రోహం వాళ్లు ఎలా మర్చిపోతారు? అందుకే వారు జగన్‌ను వారించలేదు. జరిగింది చూస్తూ ఉన్నారు. అందు కేనేమో ‘యాంటీ జగన్ కూటమి’పై పవన్ ఎంత ప్రయత్ని స్తున్నా.. సరే జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి మీద మోడీ గాని బీజేపీ పెద్దలు గాని కిమ్మనడం లేదు.(అల్ రెడీ ఈ స్కాం ఈడీ పరిధిలో ఉంది)
అసలు బీజేపీ కూడా జగన్ ప్రయత్నాలకు పరోక్షంగా సహకరిస్తుందేమో ఎన్నడూ లేనిది చంద్రబాబు ముడుపు లు తీసుకున్నట్టున్న మరో కేసులో ఐటీ చురుకుగా దర్యాప్తు చేస్తోంది. దీన్ని బేస్ చేసుకుని ఈడీ రంగంలోకి దిగొచ్చు అనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. చూస్తుంటే ఇవి రాబోయే రాజకీయ సమీకరణాలకు ముందుస్తు సంకేతాలు అనుకోవాలి. స్థూలంగా బర్డ్ వ్యూలో ఒక అంచనాకు రావొచ్చు. ప్రస్తుతానికి మోడీకి కేసీఆర్, జగన్ ఇద్దరూ కావాలి. ఆ స్థూల చిత్రంలో చంద్రబాబు అరెస్ట్ విచిత్రంగా ఏమీ అన్పించడం లేదు. ఇదే సమయంలో కవిత అరెస్ట్ జరగదు, జగన్ మీద కేసుల్లో పురోగతి ఉండదు.
ఫిజిక్స్‌లో కార్యకారణ సంబంధం అనేది ఒకటి ఉంటుంది. ఆ లెక్కన చంద్రబాబు అరెస్ట్‌కు స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం దర్యాప్తు మాత్రమే ప్రధాన కారణం కాదు. దాని చుట్టూ ఇన్ని రకాల కోణాలుంటాయి. జైలు గదిలో జగన్‌లో చంద్రబాబు మీద, సోనియా గాంధీ మీద పెరిగిన కోపం దగ్గర నుంచి మోడీ మీద చంద్రబాబు ప్రదిర్శించిన రాజకీ య వైఖరి దాకా చాలా కారణాలుంటాయి. వీటిల్లో దేన్నీ వదిలేయలేం. ఇంతటి చరిత్ర, వర్తమానం కళ్ల ముందు కన్పిస్తున్న తర్వాత.. ఈ స్కిల్ కేసు ఓ తీగ మాత్రమే.. జగన్ కదిలించే డొంక వేరే ఉంది. దానికి వెనుక పెద్దల హస్తం ఉంది.