Chandrababu: కుర్చీని తీసేసి.. చంద్రబాబు చేసిన పనికి పవన్, పురంధేశ్వరి ఫిదా

కూటమి పక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం గవర్నర్ కు మద్దతు లేఖ అందజేశారు. అయితే శాసనసభాపక్ష సమావేశంలో ఆసక్తికర పరిణామం ఒకటి వెలుగు చూసింది.

Written By: Dharma, Updated On : June 11, 2024 2:38 pm

Chandrababu

Follow us on

Chandrababu: ఏపీలో ఎన్డీఏ కూటమి పక్ష నేతగా నారా చంద్రబాబు నాయుడు ఎన్నికయ్యారు. రేపు నాలుగో సారి సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఎన్డీఏ పక్ష సమావేశాన్ని నిర్వహించారు. కూటమి తరుపున గెలిచిన 164మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు.జనసేన అధినేత పవన్, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు సైతం పాల్గొన్నారు. చంద్రబాబు వచ్చి రాగానే పవన్ కళ్యాణ్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.పురందేశ్వరి సైతం ఆత్మీయంగా స్వాగతం పలికారు.

కూటమి పక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం గవర్నర్ కు మద్దతు లేఖ అందజేశారు. అయితే శాసనసభాపక్ష సమావేశంలో ఆసక్తికర పరిణామం ఒకటి వెలుగు చూసింది. చంద్రబాబుతో పాటు పవన్, పురందేశ్వరి, అచ్చెనాయుడుల కోసం ప్రత్యేకంగా కుర్చీలు వేయించారు. చంద్రబాబు ఆసీనులు కావాల్సిన కుర్చీని అందులో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కుర్చీ పై పసుపు రంగుతో కూడిన కార్టెన్ ఏర్పాటు చేశారు. దీంతో చంద్రబాబు వెంటనే స్పందించారు. వచ్చి రాగానే పరిస్థితిని గమనించారు. సిబ్బందితో మాట్లాడి అందరి మాదిరిగానే తనకు కుర్చీని ఏర్పాటు చేసుకున్నారు.అయితే దీనిని గమనించిన పవన్ తో పాటు పురందేశ్వరి చంద్రబాబు చర్యలకు ఫిదా అయ్యారు.

పొత్తులో భాగంగా కూటమికి 166 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. అందులో 144 స్థానాల్లో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ 135 చోట్ల విజయం సాధించింది. అయితే కూటమిలో ఏకైక పెద్ద పార్టీగా టిడిపి నిలిచినా.. చంద్రబాబు మాత్రం పొత్తు ధర్మంతో ముందుకు వెళ్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా మిత్రపక్షాల మధ్య గ్యాప్ రాకూడదని భావిస్తున్నారు. అందుకే బిజెపి, జనసేనలకు ఎనలేని ప్రాధాన్యమిస్తున్నారు. మరీ ముఖ్యంగా పవన్ విషయంలో ప్రత్యేక గౌరవంతో ముందుకు పోవాలని భావిస్తున్నారు. ఎక్కడా బేషజాలాలు లేకుండా ముందుకు పోవాలన్నది చంద్రబాబు అభిమతంగా తెలుస్తోంది. ఎన్డీఏ లో తెలుగుదేశం పార్టీ రెండో అతిపెద్ద పార్టీగా ఉన్నా.. కేంద్రానికి డిమాండ్ చేయాల్సిన పొజిషన్లో ఉన్నా.. చంద్రబాబు మాత్రం సంయమనంతో వ్యవహరిస్తున్నారు. మిత్రులతో సుదీర్ఘకాలం కొనసాగాలని భావిస్తున్నారు. అందుకే ఏ చిన్న తప్పిదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.