Chandrababu And Pawan and Jagan Festival Video: పండుగలు అంటేనే అందరూ కలిసి జరుపుకునేవి. బంధాలు, బంధుత్వాలను బలోపేతం చేయడంలో పండుగలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వృత్తిరీత్యా, విధుల నిర్వహణలో దూరంగా ఉన్నవారు సైతం పండుగలకు సొంత గ్రామాలకు వసా‍్తరు కుటుంబ సభ్యులంతా కలిసి జరుపుకుంటారు. ఇక రాజకీయ నాయకులు కూడా సొంత ఊళ్లకు వెళ్తాలు. ప్రధాని మోదీ సైనికులతో పండుగలు జరుపుకుంటారు. లేదంటే ఆలయాల్లో పూజలు నిర్వహిస్తారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వైబ్స్ మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద‍్ద పండు. ఈ నేపథ్యంలో ఏఐ ఆధారంగా మన నేతలంతా కలిసి పండుగ చేసుకుంటే ఎలా ఉంటుందో చూపే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రియేటివ్ ఈవెంట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
నేతలంతా ఒకేచోట ఉన్నట్లు..
రియల్ ఫుటేజ్ లేకుండా ఏఐ టూల్స్ ఉపయోగించి నేతలను ఒకే వేదికపై చూపించారు. సంక్రాంతి సంబరాల్లో ఉల్లాసంగా ఆనందించినట్టు డిజైన్ చేసిన ఈ క్లిప్ రాజకీయ శత్రుత్వాలను దూరం చేస్తుంది. ఎక్స్‌లో పోస్టు చేసిన ఈ వీడియో ఇప్పుడు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌పాంలలో వైరల్ అవుతోంది. షేర్లు, లైక్‌లు లక్షల్లో వస్తున్నాయి. యూజర్లు హాస్యం, ఆనందంతో స్వీకరిస్తున్నారు.
ఆకట్టుకునే సన్నివేశాలు..
ఈ వీడియోలో రాజకీయంగా బద్ధ శత్రువులు అయిన చంద్రబాబు, జగన్‌మోహన్‌రెడ్డి, పవన్ కళ్యాణ్ ఎడ్లబండిపై నవ్వుతూ వెళ్లడం, వీధుల్లో చంద్రబాబు, కేసీఆర్, రేవంత్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, కేటీఆర్, పవన్ కళ్యాణ్ నడుచుకుంటూ రావడం, భోగింటల చుట్టూ చప్పట్లు కొడుతూ.. పొంగలి సేవిస్తూ నేతలంతా సందడి చేశారు. ఇవి నెటిజన‍్లను ఆకట్టుకుంటున్నాయి. ఇక గాలిపటాలు ఎగురవేయడం, ఎడ్ల బండిపై కేరింతలు కొడుతూ ప్రయాణిచండం ముచ్చటగా ఉంది.
ఉదయం లేస్తే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే నేతలంతా ఇలా కలిసి పనిచేస్తే బాగుంటుంది అన్ని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. వీడియోలో నేతలు ఆనందంగా ఉన్నట్లే ప్రజలూ ఆనందంగా ఉంటారని కొందరు కమెంట్ చేస్తున్నారు. ఇలాంటివి సొసైటీలో ఐక్యతా భావాలను ప్రోత్సహిస్తాయని కొందరు పేరొ‍్కంటున్నారు. ఈ ట్రెండ్ రాజకీయ భావజాలాన్ని మారుస్తుందని కొందరు అంటున్నారు.
రాజకీయ వైరుధ్యాలను పక్కనపెట్టి తెలుగు రాష్ట్రాల ప్రముఖ నేతలంతా సంక్రాంతి సంబరాల్లో ఒకే వేదికపై కలిసినట్లు AIతో చేసిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. pic.twitter.com/kwzBY7drZD
— ChotaNews App (@ChotaNewsApp) January 13, 2026