Homeఆంధ్రప్రదేశ్‌Visakhapatnam tech hub growth: నారా చంద్రబాబు చొరవ.. సిలికాన్ వ్యాలీ కాదు.. ఇకపై గూగుల్...

Visakhapatnam tech hub growth: నారా చంద్రబాబు చొరవ.. సిలికాన్ వ్యాలీ కాదు.. ఇకపై గూగుల్ పర్మినెంట్ అడ్రస్ మన వైజాగ్

Visakhapatnam tech hub growth: అమెరికాలోని సిలికాన్ ర్యాలీలో గూగుల్ సంస్థకు కార్యాలయాలు ఉన్నాయి. ఇక్కడినుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ ఉంటుంది. గూగుల్ వ్యవస్థాపకులు ప్రతిరోజు ఈ కేంద్రానికి వచ్చి సంస్థ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇకపై సిలికాన్ వ్యాలీ కాకుండా.. అమెరికా వెలుపల ఉన్న బెంగళూరు లేదా హైదరాబాద్ కాకుండా.. గూగుల్ సంస్థకు ఏపీలో విశాఖపట్నం పర్మినెంట్ అడ్రస్ కాబోతోంది.. చదువుతుంటే వింతగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం.

హైదరాబాదులో మైక్రోసాఫ్ట్ సంస్థను తీసుకొచ్చి ఐటి కార్యకలాపాలకు బీజం వేశారు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఒకరకంగా ఐటి విప్లవానికి ఆయన నాంది పలికారు. ఇప్పటి ఏ ఐ కాలంలో గూగుల్ సంస్థను విశాఖపట్నం తీసుకొచ్చారు చంద్రబాబు. తెర వెనుక వ్యవహారాల మొత్తం నారా లోకేష్ చక్కబెట్టారు. దీంతో విశాఖపట్నం రూపు రేఖలు సమూలంగా మారిపోతున్నాయి. ఇటీవల మిట్టల్, రిన్యూ పవర్ వంటి సంస్థలను ఏర్పాటుచేసి విశాఖపట్నం నగరాన్ని ఏపీకి కర్మగార కేంద్రంగా మార్చిన చంద్రబాబు.. ఇప్పుడు ఏకంగా గూగుల్ సంస్థను తీసుకొచ్చి.. విశాఖపట్నం నగరాన్ని గ్లోబల్ పెట్టుబడులకు స్వర్గధామం లాగా రూపొందించారు.

ఇప్పుడు విశాఖపట్నం దేశంలో ఏఐ, డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు కేంద్రంగా మారబోతోంది. విశాఖలో ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ గూగుల్ సంస్థ దాదాపు 1.3 లక్షల కోట్ల భారీ పెట్టుబడి పెట్టింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా 1000 మెగావాట్స్ హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనుంది.. మన దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడి ఇది. విశాఖపట్నం గ్లోబల్ టెక్ క్యాపిటల్ గా మార్చేందుకు చంద్రబాబు మొదటి నుంచి గట్టి పట్టుదలతో ఉన్నారు. అందువల్లే విశాఖ నగరాన్ని గ్లోబల్ పెట్టుబడులకు కేంద్రంగా మార్చారు. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోని మూడు భారీ క్యాంపస్లను నిర్మిస్తున్నారంటే.. భవిష్యత్ కార్యాచరణ ఈ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

విశాఖపట్నం కేవలం డేటా సెంటర్ మాత్రమే కాకుండా.. ప్రపంచ స్థాయిలో క్లౌడ్, ఏఐ సేవలకు కేంద్రంగా మారనుంది. స్టార్టప్స్, ఏఐ సేవలకు విశాఖపట్నం భవిష్యత్ కాలంలో ప్రపంచ క్యాపిటల్ గా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. భారీగా పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో విశాఖపట్నం నగర రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. ఇప్పటికే రియల్ ఎస్టేట్ మార్కెట్ దూకుడుగా ఉంది. పెద్ద పెద్ద కంపెనీలు క్యాంపస్ లు నిర్మిస్తున్న నేపథ్యంలో.. ఇక్కడ బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణంలో ఉన్నాయి..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version