Yanamala Ramakrishnudu: ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. జూన్లో ఏపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. అందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు.. టిడిపికి చెందిన వారు ఒకరు ఉన్నారు. ఇలా ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ పదవుల్లో రెండింటిని టిడిపి తీసుకోనుంది. జనసేనతో పాటు బిజెపికి ఒక్కో పదవి ఇవ్వనుంది. అయితే టిడిపి నుంచి పదవి విరమణ చేస్తున్న సానా సతీష్ మరోసారి కొనసాగింపు ఖాయం. టిడిపిలో మిగిలిన ఆ ఒక్క పదవి కోసం విపరీతమైన పోటీ ఉంది. సీనియర్ నేతలుగా ఉన్న యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, దేవినేని ఉమామహేశ్వరరావు.. జూనియర్ నేతలుగా ఉన్న చింతకాయల విజయ్, కిలారు రాజేష్ వంటి నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే మొన్నటి వరకు బీసీ నేతగా ఉన్న యనమల రామకృష్ణుడు పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయనకు ఖరారు చేస్తారన్న క్రమంలో ఆయన అల్లుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారు. ఈ తరుణంలో యనమల రామకృష్ణుడు అవకాశానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి.
Also Read: అసెంబ్లీలో ‘గులాబీ’ ఫైట్: కెప్టెన్ కేసీఆర్ లేని గ్రౌండ్.. రేవంత్ ‘సిక్స్’ల పండగ!
* ఎమ్మెల్సీగా పదవీ విరమణ
మొన్ననే ఎమ్మెల్సీగా పదవీ విరమణ చేశారు యనమల రామకృష్ణుడు. అయితే ఆయన తన రాజకీయ జీవితంలో అన్ని రకాల పదవులు అనుభవించారు. ఒక్క రాజ్యసభ అనేది ఆయన జీవితంలో చివరి కోరికగా ఉంది. టిడిపి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి యనమల రామకృష్ణుడు మంత్రి పదవి చేపట్టారు. ఒక్కసారి మాత్రం అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరించారు. పార్టీ ప్రతిపక్షంలో ఉంటే పిఎసి చైర్మన్ పదవి నిర్వహించేవారు.. అయితే ఈసారి టిడిపి కూటమి అధికారంలోకి రావడంతో యనమల రామకృష్ణుడును మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం నడిచింది. కానీ అది జరగలేదు. ఎమ్మెల్సీగా పదవీ విరమణ పొందిన. మరోసారి కొనసాగింపు లభించలేదు.
* గవర్నర్ గా వెళ్తారని ప్రచారం..
వాస్తవానికి యనమల రామకృష్ణుడు గవర్నర్ పోస్టులో నియామకం అవుతారని తెగ ప్రచారం నడిచింది. కానీ ఆ పదవిలో అశోక్ గజపతి రాజును నియమించారు. టిడిపికి మరో గవర్నర్ పోస్ట్ వస్తే మాత్రం యనమల రామకృష్ణుడుకు ఛాన్స్ ఇస్తారని అప్పట్లో ప్రచారం నడిచింది. అయితే రాజ్యసభ తో తన రాజకీయ జీవితం ముగించాలని యనమల రామకృష్ణుడు చంద్రబాబు వద్ద మొరపెట్టుకున్నట్లు సమాచారం. ఇంతలో ఆయన అల్లుడు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారు. దీంతో యనమల రామకృష్ణుడుకు డోర్స్ క్లోజ్ అయినట్లు ప్రచారం నడిచింది. అయితే యనమల రామకృష్ణుడు పార్టీతో పాటు చంద్రబాబుకు అందించిన సేవల దృష్ట్యా ఆయనకు రాజ్యసభ ఎంపిక ఉంటుందని పార్టీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. దాదాపు ఆయన పేరును ఖరారు చేసినట్లు సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో.
